News January 12, 2026
సుందర్ స్థానంలో బదోని

న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో గాయపడి సిరీస్‌కు దూరమైన వాషింగ్టన్ సుందర్ స్థానంలో యంగ్ ప్లేయర్ ఆయుష్ బదోనిని బీసీసీఐ ఎంపిక చేసింది. రెండో వన్డేకు ఆయన జట్టులో చేరనున్నారు. సుందర్ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నట్లు బీసీసీఐ పేర్కొంది. లిస్ట్-ఏ క్రికెట్‌లో బదోని 27 మ్యాచుల్లో 693 రన్స్ చేయగా అందులో ఒక సెంచరీ, ఐదు అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇప్పటికే గాయంతో పంత్ ఈ సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే.
Similar News
News February 6, 2026
‘ఫార్మర్ రిజిస్ట్రీ’ వల్ల కలిగే లాభాలేంటి?

కేంద్రం అమలు చేసే పథకాల లబ్ధి పొందాలంటే రైతులకు ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ తప్పనిసరి. పెట్టుబడి సాయం ‘పీఎం కిసాన్’ అందాలన్నా, పంటల బీమా ‘ఫసల్ బీమా’ నిధులు జమ కావాలన్నా, ఎరువుల రాయితీలు, పంట రుణాలు పొందాలన్నా ఈ 11 అంకెల విశిష్ఠ నెంబర్ ఉండాల్సిందే. భవిష్యత్తులో రాష్ట్రం నుంచి అమలయ్యే పథకాల లబ్ధిని అన్నదాతలు పొందాలన్నా ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ని తప్పనిసరి చేసే అవకాశం ఉంది. అందుకే నిర్లక్ష్యం చేయొద్దు.
News February 6, 2026
ఏపీ దళిత ఎంపీని కాంగ్రెస్ అవమానించింది: మోదీ

లోక్‌సభ స్పీకర్ ఛైర్‌లో కూర్చున్న ఏపీకి చెందిన దళిత ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్‌ను కాంగ్రెస్ సభ్యులు అవమానించారని PM మోదీ ఆరోపించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతున్నప్పుడు కృష్ణప్రసాద్‌పై కాగితాలు విసిరేశారని మండిపడ్డారు. అలాగే అస్సాంకు చెందిన BJP MP దిలీప్ సైకియా అధ్యక్ష స్థానంలో ఉన్నప్పుడూ ఇలాగే ప్రవర్తించారని దుయ్యబట్టారు. వారికి దళితులపై చిన్నచూపు ఉందన్నారు.
News February 6, 2026
ఏపీకి రూ.40 వేల కోట్లు.. తెలంగాణకు రూ.23 వేల కోట్లు

గత ఐదేళ్లలో జాతీయ రహదారుల విస్తరణ, నిర్వహణ కోసం తెలంగాణకు రూ.23,668 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.40,345 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. TGకు 1,854 కిలోమీటర్ల మేర 84 హైవే ప్రాజెక్టులు మంజూరు కాగా, వాటిలో 39 నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. ఏపీలో 3,633 కిలోమీటర్ల మేర 145 ప్రాజెక్టులు చేపట్టగా, 69 పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.


