News March 25, 2025

సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి!

image

మంత్రివర్గ విస్తరణలో భాగంగా బోధన్ MLAకు కల్పిస్తారన్న చర్చ నడుస్తోంది. కాగా MLC మహేశ్ కుమార్ గౌడ్‌కు PCC పదవి వరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే BSWDకి చెందిన కాసుల బాల్‌రాజ్‌‌కు ఆగ్రోస్ ఇండస్ట్రీస్ ఛైర్మన్‌గా నియమించింది. బాల్కొండకు చెందిన ఈరవత్రి అనిల్‌కు టీజీఎండీసీ ఛైర్మన్‌గా నియమించింది. కాగా ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటి వరకు ఎవరికి మంత్రి పదవీ దక్కలేదు. జిల్లాకు అమాత్య యోగముందా కామెంట్ చేయండి.

Similar News

News July 10, 2025

NZB జిల్లాలో 51.11 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం: కలెక్టర్

image

ఈ ఏడాది వన మహోత్సవంలో జిల్లా వ్యాప్తంగా 51.11 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. పక్షం రోజుల్లోనే పూర్తి స్థాయిలో మొక్కలు నాటి సంపూర్ణ లక్ష్యం సాధించేలా ముందస్తుగానే ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేశామన్నారు. గత సంవత్సరం వన మహోత్సవం సందర్భంగా 43 లక్షల మొక్కలు నాటారని చెప్పారు.

News July 10, 2025

NZB: కార్మికుల హక్కులు హరిస్తున్న బీజేపీ: MLCకవిత

image

2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మికుల హక్కులను హరిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, NZB ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. కార్మిక చట్టాలను సవరించడాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని, కార్మిక వ్యతిరేక విధానాలకు కేంద్రంలోని BJP ప్రభుత్వం స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు.

News July 10, 2025

NZB: ఫోక్ డాన్సర్ జానూ లిరి సందడి

image

ఫోక్ డాన్సర్ జానూలిరి బుధవారం నిజామాబాద్ నగరంలో సందడి చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె అక్కడి కాలేజ్ విద్యార్థులతో కలిసి వివిధ పాటలకు ఫోక్ డాన్స్ చేసి అందరిని అలరించారు. నిజామాబాద్ రావడం తనకు ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు మంచి భవిష్యత్తుతో ఉన్నత శిఖరాలకు చేరుకొని తమ తల్లిదండ్రులకు పేరు తీసుకుని రావాలని సూచించారు.