News July 15, 2024
సుదర్శన యాగ సహిత రుద్రయాగంలో ఎమ్మెల్యే

నార్కట్‌పల్లి మండలం గోపాలయపల్లి గ్రామంలో శ్రీ వారిజాల వేణు గోపాలస్వామి వారి ఆలయంలో సోమవారం సుదర్శన యాగ సహిత రుద్రయాగం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికి ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
Similar News
News September 14, 2025
నకిరేకల్‌లో టీచర్‌పై పోక్సో కేసు నమోదు

నకిరేకల్ జడ్పీహెచ్ఎస్ ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు మామిడి శ్రీనివాస్‌పై పోక్సో కేసు నమోదైంది. పదో తరగతి విద్యార్థినిని మూడు నెలలుగా వేధిస్తున్నట్లు ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన నకిరేకల్ పోలీసులు ఆరోపణలు నిర్ధారించుకుని ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
News September 14, 2025
నల్గొండ: లోక్ అదాలత్‌లో 13,814 కేసుల పరిష్కారం

జాతీయ మెగా లోక్ అదాలత్‌లో నల్గొండ జిల్లాలో 13,814 కేసులు పరిష్కారమయ్యాయి. జాతీయ న్యాయ సేవా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు లోక్ అదాలత్ విజయవంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఈ లోక్ అదాలత్‌లో పరిష్కరించిన 135 సైబర్ క్రైమ్ కేసుల బాధితులకు రూ. 54,08,392 తిరిగి చెల్లించినట్లు ఆయన పేర్కొన్నారు.
News September 14, 2025
రేపు పోలీస్ గ్రీవెన్స్ డే రద్దు: SP

జిల్లాలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పర్యటన నేపథ్యంలో సోమవారం నిర్వహించాల్సిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. గవర్నర్ పర్యటన భద్రతా ఏర్పాట్లు, ఇతర అంశాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాల్సినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజలందరూ విషయాన్ని గమనించగలరని కోరారు. తదుపరి గ్రీవెన్స్ డే యథావిధిగా ఉంటుందని పేర్కొన్నారు.