News March 23, 2024
సుధీర్ రెడ్డిపై అసమ్మతి సెగ చల్లారేనా.?

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా బొజ్జల సుధీర్ రెడ్డిని ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన పలువురు నాయకులను కలిసి మద్దతు కోరారు. ఆ మరుసటి రోజు టీడీపీ, జనసేన అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. నియోజకవర్గానికి చెందిన మరో నాయకుడు ఎస్సీవీ నాయుడు సైతం తాను సుధీర్ రెడ్డికి మద్దతు ఇవ్వలేదని చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. దీంతో కూటమి సహకారం లేకుండా విజయావకాశాలు తక్కువ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Similar News
News January 2, 2026
చిత్తూరు: రూ.350 కోట్ల ఆదాయం.. మారని బతుకులు.!

పేరుకే CM సొంత జిల్లా. కుప్పం మినహా మరెక్కడ అభివృద్ధే లేదట. పరిశ్రమలు, మౌలిక వసతులు, రవాణా అంతంత మాత్రమే. నేటికీ తాము విద్య, వైద్యం కోసం తమిళనాడు, TPTకి వెళుతున్నట్లు స్థానికులు అంటున్నారు. జిల్లాలో 960 క్వారీలు ఉన్నాయి. ఏటా రూ.200-250 కోట్ల ఆదాయం వస్తుందట. మున్సిపాలిటీ పన్నులు ఇతర మార్గాల నుంచి వచ్చే రూ.80 కోట్లు అదనం. ఈఆదాయం ఎక్కడికి పోతుంది, జిల్లా అభివృద్ధి ఎందుకు జరగలేదో ఆ మురుగన్‌కే తెలియాలి
News January 2, 2026
చిత్తూరు: తగ్గిన రిజిస్ట్రేషన్లు

జనవరి 1న రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వెలవెలబోయాయి. చిత్తూరు అర్బన్‌లో ఒక రిజిస్ట్రేషన్ కూడా జరగకపోగా, చిత్తూరు రూరల్ పరిధిలో 4 మాత్రమే అయ్యాయి. సాధారణ రోజుల్లో రెండు కార్యాలయాల్లో కలిపి 30-50 మధ్య రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి. పండగ నెల కావడంతో క్రయ, విక్రయదారులు లేకపోవడంతో కార్యాలయాలు బోసిపోయాయి. జనవరి 1న సెలవుగా భావించి పలువురు రాలేదని అధికారులు చెప్పారు.
News January 2, 2026
చిత్తూరు MPకి 94 శాతం హాజరు

2025 సంవత్సరంలో చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు పార్లమెంటుకు 94 శాతం హాజరయ్యారు. మొత్తం 122 ప్రశ్నలను పార్లమెంటులో అడిగారు. ఏడు అంశాలకు సంబంధించిన డిబేట్స్‌లో ఆయన పాల్గొన్నారు.


