News March 19, 2025

సునీత విలియమ్స్ నేటి తరానికి స్ఫూర్తి: మంత్రి సుభాష్

image

భారత సంతతి హ్యోమగామి సునీత విలియమ్స్ నేటి యువతరానికి ఆదర్శంగా నిలిచారని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ తొమ్మిది నెలలు అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌లో ఉండటం సాధరణ విషయం కాదని ఆమెను నేటి తరం యువత ఆదర్శంగా తీసుకొవాలని సూచించారు.

Similar News

News March 20, 2025

మల్యాల: రెండు పీఏసీఎస్‌లకు స్పెషల్ ఆఫీసర్స్

image

మల్యాల మండలంలోని పోతారం, నూకపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో స్పెషల్ ఆఫీసర్స్‌ను నియమిస్తూ జిల్లా సహకార అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయా సొసైటీలో అసిస్టెంట్ రిజిస్టర్లు సుజాత, శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టినట్లు సీఈవోలు తెలిపారు. అయితే బీఆర్ఎస్ ప్రాతినిథ్యం వహిస్తున్న సొసైటీలలో మాత్రమే స్పెషల్ ఆఫీసర్స్ నియమించడం ఎంతవరకు సమంజసమని నూకపల్లి సొసైటీ ఛైర్మన్ మధుసూదన్ రావు ప్రశ్నించారు.

News March 20, 2025

గన్ లైసెన్స్ ఇవ్వండి: రాజాసింగ్

image

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బెదిరింపు కాల్స్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని బుల్లెట్ ప్రూప్ వెహికిల్, సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్లొద్దని సూచించారు. అయితే గోషామహల్ నియోజకవర్గంలో ఇరుకైన రోడ్లు ఉంటాయని అందులో బుల్లెట్ ప్రూప్ వెహికిల్ తిరగలేదని రాజాసింగ్ అన్నారు. భద్రత కోసం తనకు గన్ లైసెన్స్ ఇవ్వాలని ఎమ్మెల్యే పోలీసులను కోరారు.

News March 20, 2025

SRPT: ‘రాజీవ్ యువ వికాసం’ దరఖాస్తుల ఆహ్వానం

image

SRPT జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకం కింద SC, ST, BC, మైనార్టీ నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కె.జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 5 వరకు http://tgobmmsnew.cgg.gov.inలో అప్లై చేసుకుంటే అర్హులైన వారి జాబితాను జూన్ 02న ప్రకటించి, ఒక్కొక్క నియోజకవర్గాలలో సుమారు 4 నుంచి 5వేల యూనిట్లు మంజూరు చేయనున్నారు అని అన్నారు. మరిన్ని వివరాలకు కలెక్టరేట్లో సంప్రదించాలన్నారు.

error: Content is protected !!