News February 27, 2026
సునీల్ నాయక్ ఘటన.. బిహార్ హోంశాఖ కీలక నిర్ణయం

బిహార్ హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర క్యాడర్ పోలీసులపై చర్యలు తీసుకోవాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల IPS సునీల్ నాయక్ ఘటనతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే <<19220184>>పట్నా కోర్టు<<>> IG స్థాయి అధికారిపై AP పోలీసుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. బిహార్ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ వారెంట్/కేస్ డైరీ వెంట లేకుండా సునీల్‌ను అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టింది.
Similar News
News February 28, 2026
అమెరికాతో ఢీ.. ఇరాన్‌కు ఎందుకింత ధైర్యం?

మోస్ట్ పవర్‌ఫుల్ మిలిటరీ వ్యవస్థ ఉన్న US, ఇజ్రాయెల్‌తో ఇరాన్ ఢీ అంటే ఢీ అంటోంది. తమ ఆయుధ సంపత్తితో పాటు మిత్రపక్షాల బలమే దీనికి కారణం. హమాస్, హెజ్బోల్లా, హౌతీ, పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్‌తో పాటు ఇరాక్‌లోని కొన్ని గ్రూపులూ మద్దతు ఇస్తున్నాయి. రష్యా, చైనా కూడా ఆ దేశానికి అండగా నిలుస్తున్నాయి. ఇక ఆసియాలో ఇరాన్‌కు పాక్ మిత్రదేశంగా ఉంది. కానీ USను ఎదురించి ఆ దేశానికి మద్దతిచ్చే ధైర్యం పాక్‌కు లేదు.
News February 28, 2026
ఇండియాలోనే ఎత్తైన కుటుంబాన్ని చూశారా?

సాధారణంగా కుటుంబ సభ్యులందరూ ఒకే ఎత్తులో ఉండటం అరుదు. కానీ పుణేకు(MH) చెందిన కులకర్ణి కుటుంబంలోని నలుగురూ ఆజానుబాహులే. తండ్రి శరద్ (7.2ft), తల్లి సంజ్యోత్ (6.3ft), కుమార్తెలు మృగ (6.2ft), సానియా 6.4ft ఉండటంతో ఈ కుటుంబం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. వీరి ఎత్తుకు తగ్గట్టుగా ఇంట్లోని తలుపులను 8 అడుగుల మేర రూపొందించుకున్నారు. ఇలాంటి వింత విషయాలు ‘వంద రోజుల్లో- వంద వింతలు’లో..
News February 28, 2026
స్కూల్ ఫీజులపై కీలక నిర్ణయం!

TG: ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల పెంపునకు సంబంధించిన విధివిధానాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం 11k స్కూళ్లలో ప్రస్తుత ఫీజులు, గత 3ఏళ్లలో స్కూళ్ల ఆదాయ వ్యయాల డేటాను సేకరించాలని నిర్ణయించింది. 2ఏళ్లకు 8% మాత్రమే పెంచుకునేలా అనుమతించాలని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించింది. త్వరలో ఫీజుల డ్రాఫ్ట్‌ను స్కూళ్ల వారీగా పబ్లిక్ డొమైన్‌లో పెట్టనుంది. ప్రజల అభిప్రాయాలను సేకరించి ఫీజులను ఖరారు చేయనుంది.


