News December 18, 2025
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. వనస్థలిపురం పరిధిలోని సాహెబ్ నగర్‌లో ఉన్న 102 ఎకరాల భూమి తెలంగాణ అటవీశాఖదేనని తీర్పునిచ్చింది. ఈ భూమి తమదేనని కొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించగా తాజాగా ద్విసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. 8వారాల్లో భూమిని నోటిఫై చేయాలని CSను ఆదేశించింది. దీని విలువ రూ.వేల కోట్లు ఉంటుందని తెలుస్తోంది.
Similar News
News December 19, 2025
ఆదిలాబాద్: పంచాయితీ వద్దు.. పల్లె ప్రగతే ముద్దు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1500 పైగా గ్రామాల్లో సర్పంచి ఎన్నికలు జరగగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మద్దతుదారులు స్థానాలు దక్కించుకున్నారు. ఎన్నికలు ముగియడంతో గెలిచినవారు, ఓడినవారు రాజకీయాలు చేస్తూ గ్రామాల అభివృద్ధిని విస్మరించొద్దని ప్రజలు పేర్కొంటున్నారు. అందరూ కలిసి స్థానికంగా నెలకొన్న కుక్కలు, కోతుల బెడద తొలగించాలని.. రోడ్ల, మురుగు కాలువల వంటి అనేక సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.
News December 19, 2025
మ్యాచ్ రద్దయితే ఫైనల్‌కు భారత్

అబుదాబీలో భారీ వర్షం కారణంగా భారత్-శ్రీలంక మధ్య జరగాల్సిన ఆసియా కప్ U-19 సెమీఫైనల్ మ్యాచ్ ఇంకా ప్రారంభం కాలేదు. షెడ్యూల్ ప్రకారం ఉ.10.30 గంటలకే టాస్ పడాల్సి ఉంది. కాసేపట్లో అంపైర్లు పిచ్‌ను పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు. వర్షం వల్ల ఈ మ్యాచ్ రద్దయితే పాయింట్ల టేబుల్‌లో టాప్‌లో ఉన్న భారత్ ఫైనల్ చేరనుంది. మరో సెమీస్‌లో బంగ్లా, పాక్ తలపడనున్నాయి. ఇందులో గెలిచే జట్టుతో భారత్ ఫైనల్ ఆడుతుంది.
News December 19, 2025
‘వీబీ-జీ రామ్ జీ’తో కనీస వేతనాలకు ముప్పు!

MGNREGA పేరును ‘వీబీ-జీ రామ్ జీ’గా మార్చిన కేంద్రం వ్యవసాయ సీజన్లో 60 రోజులు పనులు నిలిపివేసే అధికారాన్ని రాష్ట్రాలకు కల్పించింది. అయితే ఈ పథకం వల్ల ప్రైవేటు వ్యక్తులు కూలీలకు అంతకన్నా మెరుగైన వేతనాలు ఇచ్చేవారు. ఇప్పుడు సీజన్లో పథకం నిలిపివేస్తే ప్రైవేటు మోనోపలీ పెరిగి కనీస వేతనాలు దక్కవన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే రబీ, ఖరీఫ్ వ్యవసాయ సీజన్లలో కూలీల కొరత తీరుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.


