News October 4, 2024

సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా: మంత్రి నారా లోకేశ్

image

తిరుమల లడ్డూ ఘటనపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ మేరకు Xలో ట్వీట్ చేశారు. సత్యం గెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. కాగా ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్‌ ఏర్పాటు చేయాలని శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. సిట్‌లో సీబీఐ నుంచి ఇద్దరు అధికారులు, ఏపీ ప్రభుత్వం నుంచి ఇద్దరు పోలీసు అధికారులు, ఎఫ్‌ఎస్ఎస్‌ఏఐ నుంచి ఒక సీనియర్‌ అధికారి ఉండాలని ధర్మాసనం పేర్కొంది.

Similar News

News October 4, 2024

గుంటూరు: నేడే వైసీపీ జిల్లా అధ్యక్షుల బాధ్యతల స్వీకరణ

image

వైసీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, గుంటూరు, నర్సరావుపేట లోక్‌సభ నియోజకవర్గాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి శుక్రవారం సాయంత్రం 4 గంటలకు బాధ్యతలు స్వీకరిస్తారని పార్టీ నాయకులు తెలిపారు. స్థానిక శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే పదవీ ప్రమాణస్వీకార సభలో రాజ్యసభ సభ్యులు అయోధ్యరామిరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హాజరు అవుతారని చెప్పారు.

News October 4, 2024

అమరావతి: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే

image

ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం షెడ్యూల్‌ను సీఎం కార్యాలయం విడుదల చేసింది. సీఎం చంద్రబాబు నేడు ఉండవల్లిలోని నివాసంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ఎంఎస్ఎంఈ నూతన పాలసీపై సమీక్ష చేస్తారు. అనంతరం ఆదాయ ఆర్జన శాఖలపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం ధాన్యం సేకరణపై సీఎం సమీక్ష చేస్తారని సీఎం కార్యాలయం తెలియజేసింది.

News October 4, 2024

మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు మరో షాక్

image

బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు మరో షాక్ తగిలింది. గతంలో వెలగపూడిలో జరిగిన ఓ మహిళ మర్డర్ కేసుకు సంబంధించి తుళ్లూరు పోలీసులు పీటీ వారెంట్ కోర్టులో దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం పీటీ వారెంట్‌కు న్యాయస్థానం అనుమతిచ్చింది. ఈ నెల 7వ తేదీన తుళ్లూరు పోలీసులు గుంటూరు జైలు నుంచి మంగళగిరి కోర్టులో నందిగం సురేశ్‌ను హాజరు పరచనున్నారు. దీంతో సురేశ్‌కు గట్టి షాక్ తగిలినట్లు అయింది.