News April 7, 2025

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తిరుగు ప్రయాణం

image

తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చిన సంజీవ్ ఖన్యా తిరుగు ప్రయాణమయ్యారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరిగి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. కలెక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభం భన్సల్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు జ్ఞాపికలను అందజేసి వీడ్కోలు పలికారు. పర్యటనకు సహకరించిన జిల్లా అధికార యంత్రాంగానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News April 9, 2025

వేములవాడ: జూలై నుంచి ఆలయ విస్తరణ పనులు ప్రారంభం

image

జూలై నుంచి వేములవాడ ఆలయ విస్తరణ పనులు ప్రారంభం కానున్నట్టు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాదులో ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, అధికారులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఈనెల 15న తృతీయ ప్రణాళిక తయారుచేసి వేములవాడకు ఉన్నతాధికారులు వస్తారని ఆయన పేర్కొన్నారు. ఈనెల 20వ తేదీ లోపు పీఠాధిపతి సూచనలు తీసుకుని 21న టెండర్ ప్రక్రియ చేపట్టాలని R&B శాఖ అధికారులను ఆదేశించామన్నారు.

News April 9, 2025

సిరిసిల్ల: పోషణలోప రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

image

జిల్లాను పోషణలోప రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో అంగన్వాడి పిల్లల పోషణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీడీపీవో, సూపర్‌వైజర్లు, అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే వారికి ప్రభుత్వం నుంచి వచ్చే వాటిని సక్రమంగా అందించినప్పుడే పిల్లలలో మానసిక, శారీరక ఎదుగుదల ఉంటుందని తెలిపారు.

News April 9, 2025

‘ఓజీ’లో అకీరా నందన్.. రేణూ దేశాయ్ స్పందనిదే

image

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఓజీ’ మూవీలో అకీరా నందన్ నటిస్తున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై నటి రేణూ దేశాయ్ ఓ పాడ్ కాస్ట్‌లో స్పందించారు. ‘అకీరా ప్రస్తుతం ఏ మూవీలోనూ నటించడం లేదు. ఆయన తండ్రి పవన్ నటిస్తున్న ‘ఓజీ’లోనూ ఆయన లేరు. ఒకవేళ అకీరా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే నేనే సోషల్ మీడియాలో ప్రకటిస్తా. ప్రస్తుతం వైరల్ అవుతోన్న వార్తలన్నీ నిరాధారం’ అని ఆమె స్పష్టం చేశారు.

error: Content is protected !!