News November 3, 2025
సుప్రీం కోర్టుకు రాష్ట్రాల CSలు క్షమాపణలు

వీధికుక్కల వ్యవహారంలో AP సహా పలు రాష్ట్రాల CSలు సుప్రీంకోర్టు ముందు హాజరయ్యారు. అఫిడవిట్ల దాఖలు ఆలస్యానికి వారు క్షమాపణలు చెప్పారని సొలిసిటర్ జనరల్ కోర్టుకు నివేదించారు. తాము Oct 29నే అఫిడవిట్ ఇచ్చామని AP CS తెలిపారు. రాష్ట్రాల అఫిడవిట్ల ఆధారంగా స్ట్రే డాగ్స్ కోసం ఛార్ట్ రూపొందించాలని అమికస్ క్యూరీకి SC సూచించింది. కాగా కేసులో కుక్కకాటు బాధితులను ప్రతివాదులుగా చేర్చేందుకు కోర్టు అంగీకరించింది.
Similar News
News November 4, 2025
రాత్రంతా ఆలోచిస్తూ, ఒంటరిగా ఉంటూ.. మృత్యుంజయుడి ఆక్రందన!

అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి బయటపడిన <<16688689>>మృత్యుంజయుడు<<>> రమేశ్ మానసికంగా కుంగిపోతున్నాడు. ‘ప్రమాదంలో తమ్ముడిని కోల్పోయా. ఆ ఘటన పదే పదే గుర్తొస్తోంది. రాత్రంతా ఆలోచిస్తూ, మేలుకొనే ఉంటున్నా. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నా. నా భార్యతో, కొడుకుతోనూ మాట్లాడటం లేదు. మానసికంగా బాధపడుతున్నా. 4 నెలలుగా అమ్మ మాట్లాడట్లేదు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
News November 4, 2025
డిస్కంలకు రూ.2,635 కోట్లు విడుదల

AP: డిస్కంలకు చెల్లించాల్సిన టారిఫ్ సబ్సిడీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2025-26 మూడో త్రైమాసికానికి సంబంధించి రూ.2,635 కోట్లను రిలీజ్ చేసింది. హడ్కో నుంచి రూ.5వేల కోట్ల రుణం పొందేందుకు ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు హామీ ఇచ్చింది. విద్యుత్, బొగ్గు కొనుగోళ్లు, నిర్వహణ అవసరాలకు వెచ్చించాలని ఆదేశించింది.
News November 3, 2025
ఈ జిల్లాల్లో వర్షాలు

TG: రేపు ఉ.8.30 గంటల వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, యాదాద్రి, నిర్మల్, ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, HYD, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.


