News April 4, 2025

సుప్రీం కోర్టుకు వందనాలు: ఆర్ఎస్పీ

image

గచ్చిబౌలిలో ‘వనమేధాన్ని’ అడ్డుకున్న సుప్రీం కోర్టుకు వందనాలు అంటూ పాలమూరు BRS నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ Xలో ట్వీట్ చేశారు. HCU విద్యార్థుల పక్షాన నిలబడి పోరాడిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అభినందనలు తెలిపారు. అబద్ధాల ఆక్సిజన్‌తో, పోలీసుల పహారాలో, ప్రజల నుంచి దూరంగా తమ బంగళాల్లో సేద తీరుతున్న రేవంత్ రెడ్డి, భట్టివిక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి, కొండా సురేఖ తదితరులు వెంటనే రాజీనామా చేయాలన్నారు.

Similar News

News April 4, 2025

నిర్మల్: రేపు కలెక్టరేట్‌లో జగ్జీవన్ రామ్ జయంతి

image

నిర్మల్ పట్టణంలోని కలెక్టరేట్‌లో శనివారం ఉదయం 10 గంటలకు డా.బాబు జగ్జీవన్ రామ్ జయంతిని నిర్వహించనున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. జయంతి వేడుకలకు జిల్లాలోని అధికారులు, కుల సంఘాల ప్రజలు, అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.

News April 4, 2025

టారిఫ్ లిస్టులో పెంగ్విన్ ద్వీపం.. ట్రంప్.. పాపం!

image

ట్రంప్ టారిఫ్ లిస్ట్ ప్రపంచాన్ని కలవరపెడుతుంటే సోషల్ ప్రపంచం మాత్రం ఆయన్ను ఆడేసుకుంటోంది. ప్రతీకార సుంకాల లిస్టులో ఆస్ట్రేలియా పరిధిలోని మెక్‌డొనాల్డ్ ద్వీపం (అంటార్కిటికా ఖండ ఉపభాగం) కూడా ఉంది. ఈ ద్వీపంలో మనుషులే ఉండరు. పెంగ్విన్లు మాత్రమే నివసించే ఈ ప్రాంతం కూడా 10% దిగుమతి టారిఫ్‌కు గురవడంతో మీమర్స్ బుర్రను షార్ప్ చేసి ట్రంప్‌ను చెక్కేస్తున్నారు. పైన గ్యాలరీలో మీరు కొన్ని మీమ్స్ చూడవచ్చు.

News April 4, 2025

మహబూబాబాద్‌లో ‘అమ్మ పేరు మీద ఒక చెట్టు’

image

మహబూబాబాద్ జిల్లాలోని DFO ఆఫీసులో “అమ్మ పేరు మీద ఒక చెట్టు” పథకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జాతీయ ST కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ పాల్గొని చెట్లు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామంలో ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వాములై తప్పనిసరిగా మొక్కలు నాటాలన్నారు. నాటిన మొక్కలపై అమ్మపై చూపించే చూపించాలని పేర్కొన్నారు.

error: Content is protected !!