News December 19, 2025

సుబ్రహ్మణ్యం.. అప్పన్న కలిసే కుట్ర చేశారు.?

image

తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఏ-29 సుబ్రహ్మణ్యం, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాజీ PA చిన్న అప్పన్న కలిసి ఉద్దేశపూర్వకంగా కుట్రచేశారని కోర్టులో వాదనలు జరిగాయని తెలుస్తోంది. ప్లాంట్ తనిఖీ చేయకుండా, డెయిరీలవారితో కలిసి తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేశారని సిట్ తేల్చినట్లు సమాచారం. దీని ప్రకారం కేసు ఓ కొలిక్కి వచ్చినట్లు న్యాయవాదులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News December 20, 2025

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసిన ఎంపీ కావ్య

image

WGL కేయూలో అమలవుతున్న రూసా 2.0 (రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్) ప్రాజెక్టుల గడువు పెంచాలని WGL ఎంపీ కడియం కావ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కోరారు. ఢిల్లీలో ఆమె మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. రూసా కింద మంజూరైన రూ.50 కోట్లతో పరిశోధన కేంద్రాలు, వ్యక్తిగత రీసెర్చ్ ప్రాజెక్టులు, కె-హబ్, మౌలిక వసతుల పనులు కొనసాగుతున్నాయని వివరించారు. ప్రస్తుత గడువును మార్చి 31, 2027కు పెంచాలన్నారు.

News December 20, 2025

కృష్ణా నదిపై 6 లేన్‌ల ఐకానిక్ బ్రిడ్జిని కేంద్రం చేపట్టాలని విజ్ఞప్తి

image

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం చంద్రబాబు ఢిల్లీలో శుక్రవారం సమావేశమయ్యారు. గ్రీన్ ఫీల్డ్ నగరమైన అమరావతికి సమగ్ర హైవే గ్రిడ్ ఏర్పాటు చేయాలని, కృష్ణా నదిపై 6 లేన్ల ఐకానిక్ బ్రిడ్జిని కేంద్రం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ-హైదరాబాద్, చెన్నై-కోల్‌కతా కారిడార్లతో అమరావతిని కలపాలని, హైదరాబాద్-అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రయాణ సమయం తగ్గిస్తుందని తెలిపారు.

News December 20, 2025

గ్రామ పంచాయతీల అభివృద్ధి మీ బాధ్యతే: కలెక్టర్

image

గ్రామ పంచాయతీల అభివృద్ధి బాధ్యత నూతన సర్పంచులదేనని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. నార్నూర్ పంచాయతీ సర్పంచిగా తన కూతురు బాణోత్ కావేరి గెలుపొందడంతో సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ కార్యదర్శి గజానంద్ నాయక్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుతో కలిసి శుక్రవారం కలెక్టర్‌ను శాలువాతో సత్కరించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేసిన నీతి అయోగ్ కార్యక్రమానికి నార్నూర్ మండలం ఎంపిక కావడం గొప్ప విషయమన్నారు.