News December 10, 2025

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రంలో కోడిపుంజు ఎందుకు?

image

కార్తికేయుడి వాహనం నెమలి అని అందరికీ తెలుసు. అయితే ఆయన చిత్రాల్లో ఆ పక్షితో పాటు కోడిపుంజు కూడా ఉంటుంది. సుబ్రహ్మణ్యస్వామి శూరపద్ముడిని సంహరించేటప్పుడు ఆ రాక్షసుడు చెట్టు రూపంలో మారాడు. కార్తికేయుడు తన ఆయుధంతో ఆ చెట్టును చీల్చగా ఓ భాగం నెమలి, మరో భాగం కోడిపుంజుగా మారాయి. నెమలిని ఆయన తన వాహనంగా చేసుకున్నాడు. కోడిపుంజుని ధ్వజంగా స్వీకరించాడు. అలా కార్తికేయునికి కోడిపుంజుతో అనుబంధం ఏర్పడింది.

Similar News

News December 10, 2025

లేటెస్ట్ మూవీ అప్‌డేట్స్

image

⋆ డైరెక్టర్ సుకుమార్‌ హానెస్ట్, ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటారని హీరోయిన్ కృతిసనన్ ప్రశంసలు
⋆ ‘అఖండ-2’ ఈ నెల 12న రిలీజ్ కానుండటంతో తమ ‘మోగ్లీ’ సినిమా విడుదలను DEC 12 నుంచి 13కి వాయిదా వేసినట్లు ప్రకటించిన డైరెక్టర్ సందీప్ రాజ్
⋆ ‘అఖండ-2’ సినిమా టికెట్ ధరల పెంపుపై మరో GO జారీ చేసిన AP ప్రభుత్వం.. 11న ప్రీమియర్ల టికెట్ ధర ₹600, 12వ తేదీ నుంచి సింగిల్ స్క్రీన్లలో ₹75, మల్టీప్లెక్స్‌లలో ₹100 చొప్పున పెంపు

News December 10, 2025

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.870 పెరిగి రూ.1,30,310కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.800 ఎగబాకి రూ.1,19,450 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.8,000 పెరిగి రూ.2,07,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News December 10, 2025

ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>ఢిల్లీ <<>>కంటోన్మెంట్ బోర్డ్ 25 కాంట్రాక్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 22వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MBBS,MD/MS/DM/DNB,MCh, పీజీ డిప్లొమా , ఫిజియోథెరపిస్ట్ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://delhi.cantt.gov.in