News January 8, 2026

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణం

image

మీ వివాహ ప్రయత్నాలలో పదేపదే అడ్డంకులు ఎదురవుతున్నాయా? కుజ దోషం/సర్ప దోషం వల్ల పెళ్లి ఆలస్యమవుతోందా? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణం చేయించుకోవడం ద్వారా దోషాలు తొలగి, వివాహ గడియలు దగ్గరపడతాయి. అంతే కాకుండా కుటుంబంలో అన్యోన్యత, సంతాన సౌభాగ్యం, శత్రు జయం, సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో సమస్త కార్యసిద్ధిని కూడా పొందవచ్చు. మీ పేరు & గోత్రంతో సంకల్పం నమోదు చేసుకుని వెంటనే వేదమందిర్‌లో <>బుక్ చేసుకోండి!<<>>

Similar News

News January 10, 2026

పత్తి కట్టెతో సేంద్రియ ఎరువు తయారీ ఎలా?

image

పత్తి ఏరిన తర్వాత కట్టెలను ట్రాక్టర్‌తో నడిచే ష్రెడ్డర్ యంత్రంతో ముక్కలుగా చేయవచ్చు. తర్వాత రెక్క నాగలితో లోతు దుక్కి చేయాలి. ఈ వ్యర్థాలను తొందరగా కుళ్లించే సూక్ష్మజీవుల కల్చర్‌ను, ట్రైకోడెర్మ జీవ శిలీంధ్రనాశినిని పశువుల ఎరువుతో కలిపి నేలపై చల్లి రోటవేటర్‌తో దున్ని చదును చేయాలి. పత్తి కట్టె వ్యర్థాలను ముడి పదార్థాలుగా వాడుకొని కంపోస్ట్ లేదా వర్మికంపోస్టు విధానంలో సేంద్రియ ఎరువు తయారు చేయవచ్చు.

News January 10, 2026

సంక్రాంతికి మరిన్ని స్పెషల్ రైళ్లు

image

సంక్రాంతి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే నేటి నుంచి ఈ నెల 19 వరకు మరిన్ని స్పెషల్ ట్రైన్‌లను నడపనుంది. ఈ నెల 11, 12 తేదీల్లో HYD-సిర్పూర్ కాగజ్ నగర్(07473), ఈ నెల 10, 11 తేదీల్లో సిర్పూర్-HYD (07474), 11, 12, 12, 18, 19 తేదీల్లో HYD-విజయవాడ(07475), 10, 11, 12, 17, 19 తేదీల్లో విజయవాడ-HYD(07476) మధ్య ఈ రైళ్లు నడవనున్నాయి.

News January 10, 2026

‘అల్మాంట్-కిడ్’ సిరప్‌పై నిషేధం

image

బిహార్‌కు చెందిన ట్రైడస్ రెమెడీస్‌ కంపెనీ ‘అల్మాంట్-కిడ్’ సిరప్‌పై TG డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ నిషేధం విధించింది. చిన్నారులకు ఉపయోగించే ఈ సిరప్‌లో విషపూరితమైన ‘ఇథిలీన్ గ్లైకాల్’ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వినియోగం ప్రాణాంతకమంటూ ‘స్టాప్ యూజ్’ నోటీసు జారీ చేశారు. ‘ప్రజలు ఈ సిరప్‌ను వాడటం వెంటనే ఆపేయాలి. మీ దగ్గర ఈ మందు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1800-599-6969కు ఫిర్యాదు చేయాలి’ అని కోరారు.