News May 11, 2024

సుల్తానాబాద్: అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

image

బావిలో పడి యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సుల్తానాబాద్‌లో జరిగింది. ఎస్ఐ, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. యాదవ్ నగర్‌కు చెందిన చింతల రాజు(20) గురువారం రాత్రి భోజనం చేసి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. శుక్రవారం ఓ వ్యవసాయ బావి వద్ద తన బైక్, చెప్పులు గమనించారు. కొడుకు మృతిపట్ల అనుమానాలు ఉన్నట్లు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News January 27, 2026

KNR: కాకతీయ కెనాల్‌లో ఒకే రోజు రెండు మృతదేహాలు

image

కరీంనగర్ జిల్లా కాకతీయ కాలువలో ఒకేరోజు రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. చిగురుమామిడి మండలం నవాబుపేటకు చెందిన వివేక్ రెండు రోజుల క్రితం అదృశ్యం అవ్వగా.. నేడు సైదాపూర్ మండలం సోమారం శివారులోని కాకతీయ కాలువలో అతని మృతదేహం లభ్యమైంది. శంకరపట్నం మండలం కరింపేటకి చెందిన సాదుల అనిల్ మూడు రోజుల క్రితం కాకతీయ కాలువలో గల్లంతవ్వగా.. సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామ శివారులో అనిల్ మృతదేహం లభ్యమైంది.

News January 27, 2026

శంకరపట్నం: జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీ

image

శంకరపట్నం మండలం కేశవపట్నం జాతీయ రహదారిపై అర్ధరాత్రి 2 కార్లు ఢీకొన్నాయి. వేములవాడ దర్శనం చేసుకుని వరంగల్ వెళుతున్న ఎర్టిగా కార్ కేశవపట్నం పోలీస్ స్టేషన్ సమీపంలో ఎదురుగా వస్తున్న కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఎర్టిగా కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రెండు కార్ల ముందు భాగం పాక్షికంగా దెబ్బతింది. పోలీసులు వివరాలను నమోదు చేసుకున్నారు.

News January 26, 2026

KNR: TNGOs భవన్లో ఘనంగా గణతంత్ర వేడుకలు

image

కరీంనగర్ TNGOs భవన్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా TNGOs జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలను ప్రతి పౌరుడు గౌరవించాలని అన్నారు. దేశ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని, సేవాభావంతో విధులు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో TNGOs నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.