News February 10, 2025

సుల్తానాబాద్: తండ్రి, కొడుకు అరెస్ట్

image

సుల్తానాబాద్ పట్టణం శాస్త్రి నగర్‌లో పోలీసుల తనిఖీలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. పోలీసుల వివరాలు.. శాస్త్రి నగర్‌కు చెందిన శ్రీనివాస్(48) తన చిన్న కుమారుడు చంద్రప్రకాశ్ మహారాష్ట్ర నుంచి గంజాయి తీసుకువచ్చి తన ఇంటి వద్ద నిల్వ ఉంచాడు. వేరే దొంగతనం కేసులో కొడుకు అరెస్టయ్యాడు. అనంతరం గంజాయిని శ్రీనివాస్ బైక్‌పై తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 

Similar News

News March 7, 2026

పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

image

జనగామ జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణ పనులు పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా శనివారం నెల్లుట్ల గ్రామ పంచాయతీని సందర్శించిన ఆయన, చెరువు గట్టు వద్ద జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చిమొక్కలు, ప్లాస్టిక్ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించి, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.

News March 7, 2026

పోలీసులు భాగస్వాములు కావాలి: మెదక్ అదనపు ఎస్పీ

image

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో పోలీసులు భాగస్వాములు కావాలని అదనపు ఎస్పీ మహేందర్ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 13 నుంచి 18 వరకు సురక్షితంగా చేరుకోండి (Arrive Alive) కార్యక్రమం హోం, రవాణా శాఖల ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన, ట్రాఫిక్ నియమాల అమలు, హెల్మెట్‌పై అవగాహన కల్పించాలని సూచించారు.

News March 7, 2026

మెదక్: పరేడ్‌ పరిశీలించిన అదనపు ఎస్పీ మహేందర్

image

మెదక్ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన వారాంతపు పరేడ్‌లో జిల్లా అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ పాల్గొని, పోలీసు సిబ్బంది అందించిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం పరేడ్‌ను పరిశీలించి పోలీసు సిబ్బందికి క్రమశిక్షణ, శారీరక దృఢత్వంపై సూచనలు చేశారు. పరేడ్ నిర్వహించడం వల్ల క్రమశిక్షణ, సమయపాలనతో పాటు సిబ్బంది మధ్య సమన్వయం (కోఆర్డినేషన్) పెరుగుతుందని తెలిపారు.