News September 2, 2025
సుల్తానాబాద్: ‘భూ సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలి’

PDPL కలెక్టర్ కోయ శ్రీ హర్ష మంగళవారం సుల్తానాబాద్ తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి హైకోర్టు అనుమతినిచ్చిన నేపథ్యంలో అర్హుల జాబితా సిద్ధం చేయాలని సూచించారు. భూ భారతి కింద వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, భూ సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ బషిరుద్దిన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Similar News
News September 2, 2025
దేవాలయాల స్వయంప్రతిపత్తికి సహకరించండి: VHP

ఆంధ్రప్రదేశ్‌లోని హిందూ దేవాలయాల స్వయంప్రతిపత్తి కోసం కొత్త చట్టాన్ని తీసుకురావాలని కోరుతూ విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ప్రతినిధులు మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్‌ను కలిశారు. ఈ మేరకు ఒక నమూనా డ్రాఫ్ట్‌ను, ‘హైందవ శంఖారావం’ సభలో చేసిన తీర్మానాల ఆల్బమ్‌ను ఆయనకు అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించి, త్వరలోనే చర్యలు తీసుకుంటామని మాధవ్ హామీ ఇచ్చారని వీహెచ్‌పీ నేతలు తెలిపారు.
News September 2, 2025
పెద్దపల్లి: ‘స్వచ్ ఏవం హరిత పాఠశాల వర్క్‌షాప్ నిర్వహణ’

పెద్దపల్లి జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ పాఠశాలలో స్వచ్ ఏవం హరిత పాఠశాల వర్క్‌షాప్ నిర్వహించనన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు పూర్తిచేయాలని, నమోదు ఆధారంగా రేటింగ్ ఇచ్చి జాతీయ స్థాయి పురస్కారాలు ఇవ్వబడతాయని మంగళవారం డీఈవో మాధవి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎంఓ కవిత, అన్ని మండల MEOలు, DRPలు ప్రవీణ్, దేవేందర్, అన్ని మండల RPలు పాల్గొన్నారు.
News September 2, 2025
ఆ ప్రచారంతో ఆరు నెలలు ఆఫర్లు రాలేదు: అనుపమ

‘రంగస్థలం’ సినిమా ఆఫర్ వదులుకున్నానని తనపై తప్పుడు ప్రచారం జరిగిందని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అన్నారు. రామ్ చరణ్ సినిమాను రిజెక్ట్ చేశారనే ప్రచారంతో తాను ఆఫర్లు లేకుండా 6 నెలలు ఖాళీగా ఉన్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘రంగస్థలంలో నటించాలని సుకుమార్ అడిగారు. నేను అందుకు సిద్ధమయ్యాను. అదే సమయంలో వారు వేరే హీరోయిన్‌ను నా స్థానంలో తీసుకున్నారు’ అని చెప్పారు. ఈ మూవీలో సమంత నటించిన సంగతి తెలిసిిందే.