News April 9, 2024

సుల్తానాబాద్: మల్లన్న స్వామి పట్నాలలో ఎమ్మెల్యే

image

సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి పట్నాల మహోత్సవ వేడుకలను నేడు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్నాల మహోత్సవ వేడుకల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మంగళవారం సాయంత్రం పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక బోనం చెల్లించి మొక్కులు సమర్పించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారిని ఆలయ కమిటీ సభ్యులు కాంగ్రెస్ నాయకులు సన్మానం చేశారు.

Similar News

News February 1, 2026

ప్రజావాణి రద్దు: కరీంనగర్ కలెక్టర్

image

కరీంనగర్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కోడ్ ముగిసే వరకు ప్రజల నుంచి వినతుల స్వీకరణ ఉండదని, ఆ తర్వాతే యథావిధిగా కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ మార్పును జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.

News January 31, 2026

కరీంనగర్ కార్పొరేషన్‌లో త్రిముఖ పోటీ తప్పదా..!

image

కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ పర్వం ముగిసింది. మొత్తం 1257 నామినేషన్ సెట్లు దాఖలు చేశారు. అందులో బీఆర్ఎస్ అభ్యర్థులు 374, బీజేపీ అభ్యర్థులు 309, కాంగ్రెస్ నుంచి 252 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ నుంచి సైతం 55 మంది దరఖాస్తులు చేయగా వైసీపీ నుంచి పోటీలో ఎవరు నిలవలేదు. 93 మంది స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు.

News January 31, 2026

యాప్ ద్వారానే యూరియా పంపిణీ: KNR కలెక్టర్

image

కరీంనగర్ జిల్లాలో ఈనెల 31 నుంచి యూరియా విక్రయాలు కేవలం ‘ఎరువుల బుకింగ్ యాప్’ ద్వారానే జరుగుతాయని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. యాప్‌లో ముందే బుక్ చేసుకుని డీలర్ వద్ద కొనుగోలు చేయాలని చెప్పారు. పట్టాదారు పాసుక్ మొబైల్ నంబర్‌కు అనుసంధానమై ఉండాలని, కౌలు రైతులు యజమాని ఓటీపీతో బుక్ చేసుకోవాలని సూచించారు. బుకింగ్ గడువు మరుసటి రోజు అర్ధరాత్రి వరకే ఉంటుందని, రెండో విడతకు 15 రోజుల విరామం ఉంటుందన్నారు.