News February 16, 2026

సుల్తానాబాద్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా

image

సుల్తానాబాద్ మున్సిపల్ ఛైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. కాంగ్రెస్‌లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో, నేడు జరగాల్సిన ఎన్నిక వాయిదా పడింది. మున్సిపాలిటీపై పట్టు సాధించేందుకు రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఓ వర్గం మహారాష్ట్రలోని షిరిడీ (అహిలానగర్) క్యాంపులో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎమ్మెల్యే మద్దతు ఎవరికి ఉంటుంది? ఈ సస్పెన్స్ ఎప్పుడు వీడుతుంది? అన్నది వేచి చూడాలి.

Similar News

News February 19, 2026

ఆ షుగర్ టెస్టుపైనే ఆధారపడొద్దు: లాన్సెట్

image

షుగర్ లెవల్స్ చెక్ చేసేందుకు ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్న HbA1c టెస్టునే ప్రామాణికంగా తీసుకోవద్దని లాన్సెట్ జర్నల్ సూచించింది. ఈ టెస్టులో ఎర్రరక్త కణాల్లో (RBC) కలిసే చక్కెర స్థాయి లెక్కిస్తారు. అయితే ‘రక్తహీనత, ఇతర బ్లడ్ సమస్యలు సాధారణమైన భారత ప్రజల్లో RBCలు విచ్ఛిన్నం అవుతాయి. దీంతో ఎక్కువ కణాలు ఉన్నట్లు కన్పించి ఫలితం తప్పుగా వస్తోంది. ఫలితంగా డయాబెటిస్ ఉన్నా, తెలియడం లేదు’ అని పేర్కొంది.

News February 19, 2026

నెల్లూరు: టన్నుల్లో కవర్లు.. దొరికేది కేజీల్లోనే

image

నెల్లూరులో ప్లాస్టిక్ నిషేధం ఎక్కడా అమలు కావడం లేదు. 120 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ కవర్లను నిషేధించినా విక్రయాలు ఆగడం లేదు. సిటీలో టన్నుల కొద్దీ ప్లాస్టిక్ నిల్వలు ఉన్నా అధికారులు మంగళవారం 400 కేజీలే పట్టుకోవడం గమనార్హం. విక్రయదారులకు రూ.1.40 లక్షల ఫైన్ వేశారు. కొండాల్ని తవ్వి ఎలుకను పడుతున్నట్టుగా అధికారుల తీరు ఉందని విమర్శిస్తున్నారు. కవర్ల తయారీ కంపెనీలపై దాడు చేయాలని కోరుతున్నారు.