News April 23, 2025

సుల్తానాబాద్: లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎస్సారెస్పీ అధికారులు

image

సుల్తానాబాద్‌లోని ఎస్సారెస్పీ డివిజన్ -6 కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేసే యాజాజ్ సిక్ లీవ్‌కి సంబంధించిన జీతం చెల్లించేందుకు సూపరింటెండెంట్ శ్రీధర్ బాబు, సీనియర్ అసిస్టెంట్ సురేశ్ రూ.20వేలు లంచం డిమాండ్ చేశారు. SRSP అధికారులు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు బుధవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి నేతృత్వంలో జరిగిన ఆపరేషన్లో నగదును స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News April 24, 2025

మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం: రామ్మోహన్

image

కశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన చంద్రమౌళి భౌతికకాయాన్ని విశాఖ ఎయిర్‌పోర్టులో ఎంతో బాధతో స్వీకరించినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. చనిపోయిన వారికి సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి నివాళులు అర్పించినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. ఈ కష్టసమయంలో వారికి అండగా ఉంటామన్నారు.

News April 24, 2025

బాపట్ల: రూ.25 లక్షలతో కొళాయిలు- కలెక్టర్

image

బాపట్ల జిల్లా చినగంజాం మండలంలోని చిన్న కొత్త గొల్లపాలెంలో జల జీవన్ మిషన్ కింద రూ.25 లక్షలతో కొళాయి కనెక్షన్లు ఇస్తున్నట్లు కలెక్టర్ వెంకట మురళి బుధవారం తెలిపారు. సీఎం పర్యటనలో భాగంగా ఇచ్చిన హామీల అమలుపై జిల్లా అధికారులతో బుధవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించడానికి జల జీవన్ మిషన్ కింద పనులు మంజూరు చేసినట్లు కలెక్టర్ చెప్పారు.

News April 24, 2025

భారత్ ఆరోపణలు.. పాక్ ప్రధాని రేపు కీలక భేటీ

image

పహల్‌గామ్‌ ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని దాయాది దేశంపై భారత్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్‌లో విజయవంతంగా ఎన్నికల నిర్వహణ, ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న వేళ దాడులకు పాల్పడినట్లు విమర్శించింది. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని మహమ్మద్ షెహబాజ్ షరీఫ్ రేపు నేషనల్ సెక్యూరిటీ కమిటీ మీటింగ్ నిర్వహించనున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి ఇసాక్ దార్ తెలిపారు. భారత్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తారన్నారు.

error: Content is protected !!