News March 6, 2025

సుల్తానాబాద్: హరికృష్ణ ఓటమికి ఒక్కటైన అగ్రకుల నేతలు

image

అగ్రకుల నేతలంతా ఏకమై బీఎస్పీ బలపరిచిన బీసీ నాయకుడు, ఉమ్మడి KNR, MDK, ADB, NZB ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణను ఓటమిపాలు చేశారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల రవీందర్ ఆరోపించారు. ఆయన సుల్తానాబాద్‌లో మాట్లాడుతూ.. ఒక సామాన్యుడిని ఓడించేందుకు కాంగ్రెస్, BJP అభ్యర్థులు ఒక్కటై వందలకోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. ఇది సీఎం రేవంత్ రెడ్డి కుట్రలో భాగమేనని ఆరోపించారు.

Similar News

News March 6, 2025

YS జగన్‌పై పోలీసులకు ఫిర్యాదు

image

AP: Dy.CM పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని మాజీ సీఎం జగన్‌పై జనసేన కార్యకర్తలు ఏలూరు(D) ద్వారకా తిరుమల పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఎంపీడీవో ఆఫీసు ఎదుట నిరసనకు దిగారు. జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘పవన్ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ’ అని నిన్న జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

News March 6, 2025

ఇండియాకు అప్పగిస్తే చిత్రహింసలు పెడతారు: రాణా

image

తనను ఇండియాకు అప్పగించొద్దని ముంబై 26/11 ఉగ్రదాడి నిందితుడు తహవూర్ రాణా అమెరికా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఒకవేళ అప్పగిస్తే ఆ దేశం తనను చిత్రహింసలు పెడుతుందని, అప్పగింతపై స్టే ఇవ్వాలని కోరాడు. 2023 మానవ హక్కుల నివేదిక ప్రకారం.. భారత ప్రభుత్వం మైనారిటీలపై వివక్ష చూపుతోందని తెలిపాడు. కాగా రాణా ప్రస్తుతం LA జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడిని తమకు అప్పగించాలని కోరగా ట్రంప్ ఓకే చెప్పారు.

News March 6, 2025

ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు క్యాబినెట్ ఆమోదం

image

TG: ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ముసాయిదాకు తుది మెరుగులు దిద్దాలని, న్యాయపరమైన చిక్కులు లేకుండా చూడాలని మంత్రులకు సీఎం రేవంత్ సూచించారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలన్నారు.

error: Content is protected !!