News December 17, 2025
సుల్తానాబాద్: 8 ఓట్ల తేడాతో శైలజ విజయం

సుల్తానాబాద్ మండలం కందునూరు పల్లె గ్రామ సర్పంచి ఎన్నికల్లో చొప్పరి శైలజ ఘన విజయం సాధించారు. ఉత్కంఠభరితంగా సాగిన పోటీలో ఆయన ప్రత్యర్థిపై కేవలం ఎనిమిది ఓట్ల తేడాతో విజేతగా నిలిచారు. గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని శైలజ ఈ సందర్భంగా తెలిపారు. ఆయనకు మద్దతుగా నిలిచిన గ్రామస్తులు, అభిమానులు సంబరాలు నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
Similar News
News December 18, 2025
RR: 3 ఫేజుల్లో.. ముగ్గురు లక్కీ సర్పంచ్‌లు

రంగారెడ్డి జిల్లాలో 3విడతల్లో లక్కీగా సర్పంచ్ పీఠం ముగ్గురిని వరించింది. 1st ఫేజ్‌లో కొందర్గు చిన్నఎల్కిచర్లలో ఇద్దరికి సమాన ఓట్లురాగా టాస్‌తో రాజు గెలిచారు. 2nd ఫేజ్‌లో చేవెళ్ల గుండాలలో నరాలు తెగే ఉత్కంఠలో ఒక్క ఓటుతో బుచ్చిరెడ్డి గెలిచారు. 3rd ఫేజ్‌లో యాచారం తులేఖుర్దులో ఇద్దరికి సమాన ఓట్లు రాగా ఉద్రిక్తతకు దారితీస్తుందని గమనించిన పోలీసులు పరిస్థితి అదుపుచేయగా రికౌంటింగ్‌లో రమేశ్ గెలుపొందారు.
News December 18, 2025
పల్నాడు: వైద్యుల నిర్లక్ష్యం.. ప్రాణం కోల్పోయిన గర్భిణీ

నరసరావుపేట ప్రభుత్వాసుపత్రిలో విషాద ఘటన చోటు చేసుకుంది. రెంటచింతల మండలానికి చెందిన సాగరమ్మ (21) ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరగా, ఆపరేషన్ అనంతరం వైద్యులు ‘O పాజిటివ్’ బదులు ‘A పాజిటివ్’ రక్తం ఎక్కించినట్లు సమాచారం. దీంతో ఆమె పరిస్థితి విషమించి మగబిడ్డకు జన్మనిచ్చి కన్నుమూసింది. రక్తం గ్రూపు మార్చి ఎక్కించడం వల్లే మృతి చెందిందని బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
News December 18, 2025
పొగచూరిన ఢిల్లీ.. విమానాలు, రైళ్లు ఆలస్యం

ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరాల్సిన 40 విమానాలు ఆలస్యమయ్యాయి. అటు ఫాగ్ వల్ల 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రోడ్డుపై వచ్చిపోయే వాహనాలేవీ కనిపించడంలేదు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో ప్రయాణికులు నెమ్మదిగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా నిన్న లక్నోలో పొగ మంచు వల్ల భారత్-సౌతాఫ్రికా టీ20 మ్యాచ్ కూడా రద్దయిన విషయం తెలిసిందే.


