News August 29, 2025

సూపర్ వైజర్ పోస్టులకు దరఖాస్తులు: ప్రభాకర్

image

వయోజన విద్యా శాఖలో ఖాళీగా ఉన్న ఏడు సూపర్ వైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వయోజన విద్యాశాఖ అధికారి ప్రభాకర్ తెలిపారు. పది సంవత్సరాల సర్వీసు ఉన్న ఎస్‌జీటీ, పీఈటీ, గ్రేడ్-2 పండిట్ టీచర్లు, 45 ఏళ్లలోపు వారు అర్హులని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్ 5వ తేదీలోపు ఏలూరు వయోజన కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, సెప్టెంబర్ 9న కలెక్టరేట్‌లో ఇంటర్వ్యూలు ఉంటాయని వివరించారు.

Similar News

News August 29, 2025

HYD: ఇదేం సై‘కిల్లింగ్’.. భాయ్!

image

ఇవాళ ఉదయం సైకిల్‌పై పనికి వెళ్లే ఇద్దరికి ఓ బైకిస్ట్ ఇలా లిఫ్ట్ ఇచ్చాడు. అబిడ్స్‌లో ఓ చోట పనిచేయడానికి మలక్‌పేట్ పరిసర ప్రాంతాల నుంచి వారిద్దరు నిత్యం సైకిల్‌పై వెళ్తుంటారు. కాగా ఓ బైకర్ ఇలా లిఫ్ట్ ఇవ్వడంతో 20-25నిమిషాల సైకిల్ జర్నీ 10MINలో పూర్తైందని చెబుతున్నారు. ఇలాంటి సహసాలు చేస్తే ఇతర ప్రయాణికులకూ ప్రమాదమని పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్.

News August 29, 2025

రాజన్న ఆలయ ఈవోగా రమాదేవి

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఈవోగా ఎల్.రమాదేవి నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ఈవోగా బాధ్యతలు స్వీకరించనున్న రమాదేవి.. ఆలయ అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తానని తెలిపినట్లు సమాచారం.

News August 29, 2025

విశాఖలో బస్సు ప్రమాదంపై హోంమంత్రి అనిత ఆరా..

image

విశాఖ ఫోర్త్ పోలీస్ స్టేషన్ హైవే వద్ద శుక్రవారం ఉదయం కూర్మన్నపాలెం నుంచి విజయనగరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. ఈ ప్రమాదం సాంకేతిక లోపంతో జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు.ఈ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆరా తీశారు. పోలీస్ అధికారులు, ఆర్టీసీ అధికారులతో ఆమె మాట్లాడారు.