News September 10, 2025

సూపర్ ‘హిట్టేనా’?

image

అనంతపురంలో ‘సూపర్-6, సూపర్ హిట్’ సభ ముగిసింది. ఈ వేదిక నుంచి ఆటో డ్రైవర్లకు సీఎం చంద్రబాబు దసరా కానుక ప్రకటించారు. పవన్ కళ్యాణ్ తన శాఖ అంశాలపైనే మాట్లాడి నిమిషాల్లోనే స్పీచ్ ముగించారు. కూటమి పాలనలో సూపర్-6 కాదు.. అనేక సిక్సర్లు కొట్టామని ఏపీ BJP చీఫ్ మాధవ్ అన్నారు. జిల్లా నేతలందరికీ మాట్లాడే అవకాశం రాగా, ఈ సభకు 3లక్షల మంది వచ్చారని నేతలు చెబుతున్నారు. మరి ఈ సభ <<17669565>>‘హిట్టేనా’?<<>> మీ కామెంట్..

Similar News

News March 27, 2026

తిరుపతి: పంచాయతీ ఓటర్ల పరిశీలన

image

తిరుపతి జిల్లా వ్యాప్తంగా 811 పంచాయతీల పాలకమండళ్ల గడువు ఏప్రిల్ 2వ తేదీతో ముగియనుంది. 3 నుంచి ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో పంచాయతీల్లో ఓటర్ల జాబితాపై అధికారుల పరిశీలన చేస్తున్నారు. ఇందులో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నట్లు సమాచారం.

News March 27, 2026

ఏప్రిల్ 1 నుంచి ధాన్యం కొనుగోళ్లు: ప.గో జేసీ

image

రబీ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించనున్నట్లు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం తాడేపల్లిగూడెం (M) మోదుగగుంటలో రైతుల అవగాహన సదస్సు నిర్వహించారు. ధాన్యం సేకరణకు రెండు కోట్ల గోనె సంచులను సిద్ధం చేశామన్నారు. సంచుల నాణ్యతను రైతులు పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

News March 27, 2026

విశాఖ: ‘ముగ్గురిహత్య’.. కోర్టు షాకింగ్ తీర్పు.!

image

పెందుర్తి పరిధిలో ముగ్గురు వృద్ధులను దారుణంగా హత్య చేసిన నిందితుడు చందాక రాంబాబుకు జిల్లా మహిళా కోర్టు జీవితఖైదు విధిస్తూ గురువారం తీర్పునిచ్చింది. కొత్త భవనాల వద్ద కాపలా ఉన్న వృద్ధ దంపతులతో పాటు మరో వృద్ధురాలిని నిందితుడు హత్య చేసినట్లు విచారణలో రుజువైంది. శిక్షతో పాటు ₹30,000 జరిమానా, బాధితులకు ₹లక్ష పరిహారం ప్రకటించింది. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసులను సీపీ అభినందించారు.