News October 8, 2025
సూరంపల్లిలో అక్రమ కల్తీ మద్యం పట్టివేత

గన్నవరం మండలం సూరంపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఎక్సైజ్ అధికారులు భారీగా అక్రమ కల్తీ మద్యాన్ని పట్టుకున్నారు. తయారీదారులపై ఉక్కుపాదం మోపారు. గత రాత్రి మైలవరంలో కూడా భారీ మొత్తంలో కల్తీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మరవకముందే మంగళవారం సూరంపల్లిలో మరో దాడి చేశారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించే ఈ రాకెట్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
Similar News
News April 13, 2026
పల్నాడు: 15న ధరణికోటకు సీఎం చంద్రబాబు

రాష్ట్ర వ్యాప్తంగా మూడో విడత అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15న పల్నాడు(D) అమరావతి(M) ధరణికోటలో నూతనంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను CM చంద్రబాబు ప్రారంభించనున్నారు. CM పర్యటన దృష్ట్యా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. హెలిప్యాడ్ నిర్మాణం, విద్యుత్ సరఫరా, తాగునీరు వంటి మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
News April 13, 2026
నిప్పుల కొలిమి నిజామాబాద్.. 40 దాటిన టెంపరేచర్

జిల్లాలో భానుడు భగభగలాడుతున్నాడు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం జిల్లావ్యాప్తంగా ఎండ తీవ్రత ‘అలర్ట్’ స్థాయికి చేరింది. ముఖ్యంగా మోస్రా, సాలూరలో అత్యధికంగా 41.6, నిజామాబాద్ సౌత్ 41.5°C, పెర్కిట్ (ఆర్మూర్):41.5°C, యెడపల్లి: 41.5°C మంచిప్ప, తుంపల్లిలోనూ 41.5 డిగ్రీల వేడి నమోదైంది. ఉదయం నుంచే సెగలు పుడుతుండటంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
News April 13, 2026
NGKL: జిల్లాలో పెరుగుతున్న ఎండలు

నాగర్ కర్నూల్ జిల్లాలో ఎండలు సెగలు పుట్టిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో సిర్సనగండ్ల, పెద్దకొత్తపల్లిలో అత్యధికంగా 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లావ్యాప్తంగా కల్వకుర్తి, జటప్రోలు, లింగాల తదితర ప్రాంతాల్లోనూ పార 41 డిగ్రీలు దాటింది. భానుడి భగభగలకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఉదయం నుంచే వడగాల్పులు వీస్తుండటంతో అత్యవసరమైతే తప్ప జనం బయటకు రావడం లేదు.


