News October 31, 2025

సూర్యలంక సముద్ర స్నానాలపై నిషేధం: CI

image

బాపట్ల మండలం సూర్యలంక సముద్ర తీరంలో సముద్ర స్నానాలపై నిషేధం కొనసాగిస్తున్నట్లు మెరైన్ సీఐ లక్ష్మారెడ్డి గురువారం తెలిపారు. తుపాను ప్రభావంతో సముద్రంలో అలలు ఎగసిపడుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో సముద్ర తీరంలోకి టూరిస్టులు, భక్తుల ప్రవేశం నిషేధించినట్లు వివరించారు. భక్తులు గమనించి అధికారులు ప్రకటించే వరకు ఎవరూ తీరానికి రావద్దని సూచించారు. ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు.

Similar News

News October 31, 2025

MHBD: 22 ప్రాథమిక పాఠశాల్లో నూతనంగా ప్రీ ప్రైమరీ తరగతులు

image

MHBD జిల్లాలోని నూతనంగా 22 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించేందుకు ప్రైమరీ విభాగానికి రెండు పోస్టులను DEO దక్షిణామూర్తి మంజూరు చేశారు. ప్రతి పాఠశాలకు ఒక పూర్వ ప్రాథమిక బోధకులు, ప్రతి పాఠశాలకు ఒక ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకు కనీస విద్యార్హత ఇంటర్మీడియట్ ఉండాలన్నారు. ఆయా పోస్టులకు కనీస విద్యార్హత 7వ తరగతి ఉత్తీర్ణత ఉండాలని, దరఖాస్తులను నవంబర్ 7 వరకు MEOలకు అందించాలన్నారు.

News October 31, 2025

GNT: పీజీ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో జరిగిన పలు పీజీ పరీక్షలకు సంబంధించి రీవాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నిర్వహణాధికారి శివప్రసాదరావు శుక్రవారం తెలిపారు. 1,3 సెమిస్టర్ ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్, బోటనీ, ఎంసీఏ మొదటి సెమిస్టర్ ఎల్.ఎల్.ఎమ్ పరీక్ష ఫలితాలను ప్రకటించామన్నారు. ఫలితాలను వర్సిటీ వెబ్సైట్ నుంచి పొందవచ్చని తెలిపారు.

News October 31, 2025

కొట్టుకుపోయిన డీసీఎం లభ్యం.. డ్రైవర్ కోసం గాలింపు

image

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురం గ్రామం సమీపంలోని నిమ్మ వాగు వరద నీటిలో కొట్టుకుపోయిన డీసీఎం వ్యాన్ ఆచూకీ లభించింది. వరద నీరు తగ్గిపోవడంతో వాగులో డీసీఎం వ్యాన్ బయటపడింది. పోలీసులు, రెవెన్యూ అధికారుల సహకారంతో క్రేన్ల ద్వారా ఆ వ్యాన్‌ను బయటకు తీశారు. అయితే, డ్రైవర్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో అతని కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు.