News October 15, 2025
సూర్యాపేట: అక్రమ రవాణాపై కఠిన చర్యలు: ఎస్పీ నర్సింహ

సూర్యాపేట జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణాపై దాడులు నిర్వహిస్తున్నామని ఎస్పీ నరసింహ తెలిపారు. మంగళవారం తనిఖీలు నిర్వహించి ఆయన మాట్లాడుతూ.. గంజాయి, అక్రమ పశువుల రవాణా, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతర్రాష్ట్ర నేరస్తుల కదలికలపై నిఘా ఉంచామని పేర్కొన్నారు.
Similar News
News October 15, 2025
HYD: సనత్‌నగర్‌లో గన్, తల్వార్ సీజ్

హైదరాబాద్ సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్‌నగర్‌లో గన్‌తో హల్‌చల్ చేస్తున్న చంద్రకాంత్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చంద్రకాంత్ గన్, తల్వార్‌తో కొంతకాలంగా కాలనీవాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడనే ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు అతడి నుంచి గన్, తల్వార్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
News October 15, 2025
సంగారెడ్డి: బెస్ట్ అవైలబుల్ బకాయిలు చెల్లిస్తాం: కలెక్టర్

బెస్ట్ అవైలబుల్ పాఠశాలల బకాయిలు చెల్లించేలా కృషి చేస్తానని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి అఖిలేష్ రెడ్డి పాల్గొన్నారు.
News October 15, 2025
KMR: కన్న పేగుపైనే క్రూరత్వం

కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష పడింది. విద్యార్థినిపై ఆమె తండ్రి అత్యాచారానికి పాల్పడినట్లు బాన్సువాడ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల హెడ్ మాస్టర్ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయగా నేరం రుజువైంది. దీంతో జిల్లా న్యాయమూర్తి వర ప్రసాద్ నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.30 వేల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు ఇచ్చారు.