News September 20, 2025
సూర్యాపేట: అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

ఆకాశమే హద్దుగా అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేటలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో జరిగిన గ్రాడ్యుయేషన్ డే 2025 కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. నేటి సాంకేతిక, కృత్రిమ మేధస్సు యుగంలో స్వతంత్రంగా ఆలోచనలతో భవిష్యత్తులో ఏమి అవ్వాలో ఆలోచిస్తూ దాన్ని చేరేందుకు కృషి చేయాలన్నారు.
Similar News
News September 21, 2025
H1B వీసా సమస్యను వెంటనే పరిష్కరించాలి: CM రేవంత్

TG: H1B వీసాపై ట్రంప్ ఆదేశాలు దిగ్భ్రాంతికి గురిచేశాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చారిత్రక ఇండో-అమెరికన్ సత్సంబంధాల్లో ఇది ఏమాత్రం ఆమోదయోగ్యమైన నిర్ణయం కాదన్నారు. దీని వల్ల తెలుగు టెకీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని ప్రధాని మోదీ, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ను కోరుతూ రేవంత్ ట్వీట్ చేశారు.
News September 21, 2025
భట్టిప్రోలు వద్ద ప్రమాదం.. తండ్రీ కూతురు మృతి

ఒకే కుటుంబానికి చెందిన ఇరువురు మృతి చెందిన ఘటన బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలంలో శనివారం చోటుచేసుకుంది. SI శివయ్య తెలిపిన వివరాల మేరకు… రేపల్లెకు చెందిన చొక్కాకుల నాగసాయి అతని భార్య, ఇద్దరు పిల్లలు ద్విచక్ర వాహనంపై రేపల్లె నుంచి బాపట్ల వెళ్తుండగా కన్నెగంటివారిపాలెం హైవేపై తమ ముందు వెళ్తున్న ఒంటి ఎద్దు బండిని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో నాగసాయి అతని కూతురు పల్లవి అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు.
News September 21, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

✓ పాల్వంచ పెద్దమ్మ గుడిలో వైభవంగా రుద్రహోమం
✓ భద్రాద్రి: తల్లీ, కుమారుడు అదృశ్యం
✓ మణుగూరు: ఈవోతో భక్తుల వాగ్వాదం..!
✓ అశ్వారావుపేట సొసైటీ సీఈవో సస్పెన్షన్
✓ అశ్వారావుపేట పోలీసులపై దాడికి యత్నం.. వ్యక్తిపై కేసు
✓ సింగరేణి కార్మికులకు వాటా ఇవ్వాలని సీఎంకు కొత్తగూడెం ఎమ్మెల్యే వినతి
✓ మణుగూరు: డ్రగ్స్ నివారణపై విద్యార్థులకు అవగాహన
✓ కొత్తగూడెం: గంజాయి విక్రయదారుల అరెస్ట్