News November 15, 2025
సూర్యాపేట: ఆర్ఎంపీల కమీషన్ దందా..!

సూర్యాపేట జిల్లాలో ఆర్ఎంపీల కమీషన్ దందా నడుస్తోంది. ఎక్కువ కమీషన్ ఇచ్చే ప్రైవేటు ఆసుపత్రులకు ఆర్ఎంపీలు రోగులను రిఫర్ చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఆస్పత్రులు ప్రతి కేసుకూ ఆర్ఎంపీలకు భారీగా కమీషన్లు ఇస్తున్నట్లు సమాచారం. ఈ కారణంగానే రోగులు అధిక ఖర్చుల భారాన్ని మోయాల్సి వస్తోంది. అధికారులు తక్షణమే స్పందించి, ఈ అక్రమ దందాను అరికట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News November 15, 2025
ముగిసిన టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్

సౌతాఫ్రికాతో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా 189/9 పరుగులకు పరిమితమైంది. గిల్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. KL రాహుల్(39), సుందర్(29) పంత్(27), జడేజా(27) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. SA బౌలర్లలో సిమోన్ 4, జాన్‌సెన్ 3 వికెట్లు, మహరాజ్, బోష్ చెరో వికెట్ పడగొట్టారు. ఇండియాకు 30 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది.
News November 15, 2025
రెండో రోజు CII సమ్మిట్ ఫొటో గ్యాలరీ

AP: విశాఖలో CII సమ్మిట్ రెండోరోజు కొనసాగుతోంది. వివిధ దేశాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలతో సదస్సు ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది. పరిశ్రమల ఏర్పాటుకు వచ్చే అధినేతలకు సంప్రదాయ నృత్యాలతో కళాకారులు స్వాగతం పలుకుతున్నారు. సమ్మిట్‌లోని పలు స్టాల్స్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఏపీ రాజధాని అమరావతి నమూనాను ఆసక్తిగా తిలకిస్తున్నారు. యువత కూడా ఉత్సాహంగా హాజరవుతున్నారు.
News November 15, 2025
GWL: షార్ట్ ఫిల్మ్‌కు రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి

గద్వాల జిల్లా అయిజ మండలం పులికల్, రాజాపూర్ గ్రామాలకు చెందిన ‘పల్లెటూరి కుర్రాళ్లు’ ట్రూప్ రూపొందించిన షార్ట్ ఫిల్మ్‌కు రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి లభించింది. హెల్మెట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్ చేసేవారికి అవగాహన కల్పిస్తూ దీనిని రూపొందించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన పోటీల్లో దీనిని ఎంపిక చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో డీజీపీ శివధర్ రెడ్డి బహుమతి అందజేశారు.


