News December 19, 2025
సూర్యాపేట: ఆ బిల్లును వెంటనే ఉపసంహరించాలి: జూలకంటి

సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన సీపీఎం జిల్లా కమిటీ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడారు. ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే బిల్లును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లుతో కూలీలు, పేదలకు తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొంటూ ఈనెల 20 నుంచి 23 వరకు జిల్లా వ్యాప్తంగా బిల్లుపత్రాలను దహనం చేయాలని పిలుపునిచ్చారు.
Similar News
News December 23, 2025
Money Tip: కోటి రూపాయలు ఉన్నాయా? ఈ చేదు నిజం తెలుసుకోండి!

ద్రవ్యోల్బణం వల్ల డబ్బు కొనుగోలు శక్తి ఏటేటా తగ్గుతూ ఉంటుంది. ప్రస్తుత లెక్కల ప్రకారం సగటున 5% ద్రవ్యోల్బణం ఉంటుందని అంచనా వేస్తే నేటి ₹కోటి విలువ పదేళ్ల తర్వాత దాదాపు ₹61.37 లక్షలకు పడిపోతుంది. ఈరోజు ₹కోటితో కొనే వస్తువులు లేదా ఆస్తులను పదేళ్ల తర్వాత కొనాలంటే సుమారు ₹1.62 కోట్లు అవసరమవుతాయి. అందుకే కేవలం పొదుపుపైనే కాకుండా ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడినిచ్చే పెట్టుబడులపై దృష్టి పెట్టాలి.
News December 23, 2025
‘ఈ ఏడు కాకుంటే.. వచ్చే ఏడాదైనా మారుతుంది’

ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా, శరీరాన్ని తాకట్టుపెట్టి, సాగులోనే మనసును బందీ చేసి, ఆత్మని పొలంలోనే పాతిపెడతాడు అన్నదాత. చర్మం మండేలా కాసే ఎండలోనైనా, ఎముకల కొరికే చలినైనా, కుండపోత వర్షమైనా దేనినీ లెక్క చేయకుండా సేద్యం చేస్తూ, తన పంటను కాపాడుకొనేందుకు పగలు, రాత్రి కష్టపడతాడు. ప్రకృతి ప్రకోపంతో పంట కోల్పోయినా.. ఈ ఏడు కాకపోతే వచ్చే ఏడాదైనా పరిస్థితి మారుతుందనే ఆశతో జీవించే ఏకైక వ్యక్తి ‘రైతు’.
News December 23, 2025
KMR: నమస్తే సర్పంచ్ సాబ్! ఇక పల్లెల్లో అభివృద్ధి పరుగులే

కామారెడ్డి జిల్లాలో గ్రామ పంచాయతీల్లో రెండేళ్ల నిరీక్షణకు తెరపడింది. తాజాగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు గ్రామాభివృద్ధికి, ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. నేటి నుండి పూర్తిస్థాయి పాలన ప్రారంభం కావడంతో, ఆగిపోయిన అభివృద్ధి పనులు ఇకపై ఊపందుకోనున్నాయి.


