News March 4, 2025

సూర్యాపేట: ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

ఈనెల 5 నుంచి 25 వరకు జరగనున్న ఇంటర్ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ తేజస్వి నందలాల్ పవార్ సోమవారం తెలిపారు. జిల్లాలో 32 పరీక్ష కేంద్రాలలో ఉ.9 గంటల నుంచి మ.12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు ఒక గంట ముందే చేరుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద BNS 163 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రాలకు సెల్ ఫోన్లు అనుమతిలేదన్నారు.

Similar News

News March 4, 2025

భద్రాచలం బిడ్డకు అత్యున్నత పదవి..!

image

భద్రాచలం సీనియర్ న్యాయవాది జెట్టి సాల్మన్ రాజుని తెలంగాణ హైకోర్టు ఏజీపీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్న సాల్మన్ రాజు సోమవారం హైకోర్టు ఏజీపీగా నియమితుడై హైకోర్టు అడిషనల్ జనరల్ రంజిత్ రెడ్డి చేతులు మీదుగా నియామక పత్రాన్ని స్వీకరించారు. భద్రాచలం న్యాయవాది హైకోర్టు ఏజీపీగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

News March 4, 2025

ప్రభాస్ ‘ఫౌజీ’లో విలన్‌గా సన్నీ డియోల్?

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ఫౌజీ’ మూవీపై ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో విలన్‌గా బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని టాక్. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తున్నారు. మరో హీరోయిన్‌గా సాయిపల్లవి నటిస్తారని సమాచారం. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

News March 4, 2025

జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోండి: ఎస్పీ

image

మార్చి8న జాతీయ లోక్‌అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన మాట్లాడుతూ… జిల్లా ప్రజలకు ఇదొక సువర్ణావకాశం. పోలీస్ స్టేషన్లో నమోదు అయిన కేసుల్లో, క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి కేసులు నమోదు చేసుకొని పంతాలకు పోకుండా రాజీపడే కేసుల్లో కక్షిదారులు రాజీపడి అన్నదమ్ముల్లా మెలగాలన్నారు. రాజీమార్గమే రాజమార్గమని పేర్కొన్నారు.

error: Content is protected !!