News December 19, 2025

సూర్యాపేట: ఈనెల 22న జిల్లాలో విపత్తు నిర్వహణ మాక్ డ్రిల్

image

ప్రజలకు విపత్తు సమయంలో అవసరమైన సేవలు అందించేందుకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. సూర్యాపేటలో ఆయన మాట్లాడారు.జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో 22న మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు తెలిపారు. వరదలు, పరిశ్రమ, రహదారి ప్రమాదాల సమయంలో ప్రజలను రక్షించడం,ఉపశమన శిబిరాలు ఏర్పాటు చేయడం,వైద్య, అగ్నిమాపక, పోలీస్ శాఖలు సమన్వయంతో పని చేయడం ముఖ్యమన్నారు.

Similar News

News December 21, 2025

విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొస్తాం: మంత్రి అడ్లూరి

image

రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా రాష్ట్రంలోని నూతనంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను సర్వహంగులతో పాఠశాలలను నిర్మించి విద్యావ్యవస్థలో పెను మార్పులు తీసుకొస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం హైదరాబాదులో జరిగిన రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. అధికారంలోకి రాగానే డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులను నియమించామన్నారు.

News December 21, 2025

తిరుపతి జిల్లా ప్రజలకు గమనిక

image

తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన పబ్లిక్ గ్రీవెన్స్‌ను రద్దు చేసినట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. జిల్లాకు ప్రముఖుల రాక నేపథ్యంలో తాత్కాలికంగా రద్దు చేశామన్నారు. భద్రత ఏర్పాట్లు, విధి నిర్వహణ కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

News December 21, 2025

వనపర్తి: బాధితులకు రూ.12.50 లక్షల సైబర్ సొమ్ము అప్పగింత: ఎస్పీ

image

వనపర్తి జిల్లాలో నమోదైన 17 సైబర్ నేర కేసుల్లో బాధితులు కోల్పోయిన రూ.12.50 లక్షల నగదును పోలీసులు విజయవంతంగా రికవరీ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా ఈ సొమ్మును బాధితులకు అందజేసినట్లు ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. సైబర్ పోలీసులు సమర్థవంతంగా పనిచేసి ఈ మొత్తాన్ని ట్రేస్ చేశారని, న్యాయస్థానం ద్వారా చట్టబద్ధంగా బాధితులకు తిరిగి అప్పగించామని ఆమె పేర్కొన్నారు.