News October 27, 2025

సూర్యాపేట: ఈ దంపతులను వరించిన ‘లక్కీ’ డ్రా

image

సూర్యాపేట కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన మద్యం టెండర్ల లక్కీ డ్రాలో ఓ దంపతులను అదృష్టం వరించింది. వేములపల్లి మం. లక్ష్మీదేవిగూడెం గ్రామానికి చెందిన ఎలికట్టి భరత్‌ గెజిట్ నంబర్ 21లో, ఆయన భార్య శ్రావణి గెజిట్ నంబర్ 13లో దుకాణాలు దక్కించుకున్నారు. కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆధ్వర్యంలో డ్రా పద్ధతిలో దుకాణాల ఎంపిక చేశారు. ఒకే కుటుంబంలో భార్యాభర్తలకు షాపులు దక్కడంతో పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News October 27, 2025

వాస్తు పాటిస్తే సిరులు సొంతమవుతాయా?

image

వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకుంటే సరిపోదని, ఆ ఇంట్లోని వినియోగం కూడా వాస్తు నియమాలకు అనుగుణంగా ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. అప్పుడే సిరిసంపదలు, సుఖసంతోషాలు లభిస్తాయన్నారు. ‘వాస్తును నిర్లక్ష్యం చేస్తే.. అనుకోని ఇబ్బందులు ఎదురుకావొచ్చు. అలాంటి పరిస్థితుల్లో వాస్తు నిపుణులను సంప్రదించి, స్వల్ప మార్పులు చేసుకోవచ్చు. వాస్తును పాటిస్తే శుభాలు చేకూరుతాయి’ అని ఆయన వివరించారు. <<-se>>#Vasthu<<>>

News October 27, 2025

లోతట్టు ప్రాంతాల్లో కూరగాయల పంపిణీ

image

మొంథా తుఫాను నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా 15 మొబైల్‌ వాహనాల ద్వారా కూరగాయలను విక్రయించే ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ హిమాన్షు శుక్ల తెలిపారు. జిల్లా మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో తుఫాను ప్రభావిత ప్రాంతాలకు ఈ మొబైల్‌ వాహనాలను పంపి ప్రజలకు నాణ్యమైన కూరగాయలను తక్కువ ధరకు అందించేలా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ చెప్పారు.

News October 27, 2025

ఇది మోదీ, ఈసీల బహిరంగ ఓట్ల దొంగతనం: కాంగ్రెస్

image

EC ప్రకటించిన రెండో దశ <<18119730>>SIR<<>>పై కాంగ్రెస్ మండిపడింది. 12 రాష్ట్రాలు, UTల్లో ఓట్ చోరీ ఆట ఆడేందుకు EC సిద్ధమైందని విమర్శించింది. బిహార్‌లో 69 లక్షల ఓట్లను తొలగించిందని, ఇప్పుడు కోట్ల ఓట్లను డిలీట్ చేసేందుకు రెడీ అవుతోందని ఆరోపించింది. ఇది మోదీ, ఈసీ కలిసి చేస్తున్న బహిరంగ ఓట్ల దొంగతనమని ట్వీట్ చేసింది. మరోవైపు SIRను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కేరళ సీఎం విజయన్, తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటించారు.