News February 16, 2026

సూర్యాపేట: ‘ఈ విజయం దామన్నకే అంకితం’

image

సూర్యాపేట మున్సిపాలిటీలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎంపిక కావడంతో పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుంచి పూల సెంటర్, పొట్టి శ్రీరాముల సెంటర్ వరకు జరుగుతున్న విజయోత్సవ ర్యాలీలో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి చిత్ర పటాలను చేత పట్టుకొని ర్యాలీలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ విజయం ఆయనకే సొంతం అంటూ నినాదాలు చేశారు.

Similar News

News February 19, 2026

లింగంపల్లి-విశాఖపట్నం జన్మభూమి ఎక్స్‌ప్రెస్ సమయంలో మార్పులు

image

లింగంపల్లి నుంచి విశాఖపట్నం వరకు వెళ్లే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైం టేబుల్ మారింది. లింగంపల్లిలో ఉదయం 6:55, బేగంపేటలో 7:20, సికింద్రాబాద్‌లో 7:40, చర్లపల్లి 8:00, రామన్న పేట 8:30, నల్గొండ 9:00, మిర్యాలగూడ 9:30కు చేరుతుంది. నడికుడి జంక్షన్ 10:00, పిడుగురాళ్ల 10:20, సత్తనపల్లి 10:45, గుంటూరు జంక్షన్ 11:45కు చేరుకుంటుందని రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రయాణికులు గమనించాలని సూచించారు.

News February 19, 2026

కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం

image

కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఐదుగురు అగ్రనేతలు మృతిచెందినట్లు సమాచారం. ఈ ఉదయం ఆపరేషన్-2 కగార్ ప్రారంభమైన విషయం తెలిసిందే. కూంబింగ్ చేస్తున్న CRPF బలగాలకు మావోయిస్టులు ఎదురు పడటంతో కాల్పులు జరపగా ఐదుగురు మావోలు హతమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఆస్కారముంది. మావోయిస్ట్ కార్యదర్శి దేవ్ జీ టార్గెట్‌గా కూంబింగ్ కొనసాగుతోంది.

News February 19, 2026

శ్రీకాకుళంలో ఎండలు, ఉక్కబోత ప్రారంభం

image

శ్రీకాకుళం జిల్లాలో గత రెండు రోజులుగా ఎండలు, ఉక్కబోత పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా మహాశివరాత్రి తర్వాత రోజుల నుంచి వేడి తీవ్రత మొదలవుతుందని చెబుతున్నారు. ఈసారి కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం 10 గంటలకే ఎండ తీవ్రత గణనీయంగా పెరుగుతుంది. వాతావరణ నిపుణుల ప్రకారం, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది.