News March 30, 2024
సూర్యాపేట: ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకం: మంత్రి ఉత్తమ్

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుందని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి దామోదర్ రెడ్డి నివాసంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ రాజకీయాల్లో నల్లగొండ పార్లమెంటుకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. బీఆర్ఎస్, బీజేపీలకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.
Similar News
News September 8, 2025
మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్షకు దరఖాస్తు చేసుకోండి: DEO బిక్షపతి

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్ష కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈవో భిక్షపతి తెలిపారు. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని, ఏడో తరగతిలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని చెప్పారు. దరఖాస్తులను http://bsc.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫీజు చెల్లించి సమర్పించాలని కోరారు.
News September 8, 2025
NLG: సీసీటీవీ ఇన్స్టాలేషన్, సర్వీస్‌లో ఉచిత శిక్షణ

నల్గొండ శివారులోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ పురుషులకు CCTV ఇన్స్టాలేషన్, సర్వీస్‌లో 13 రోజుల ఉచిత శిక్షణ సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభిస్తున్నామని సంస్థ సంచాలకులు రఘుపతి సోమవారం తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత టూల్ కిట్, వసతి, భోజనం కల్పిస్తామన్నారు. 18 సం. నుండి 45 లోపు ఉమ్మడి జిల్లా వారు అర్హులని,ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని 7032415062 సంప్రదించాలన్నారు.
News September 8, 2025
నేడు గ్రీవెన్స్ డే రద్దు: ఎస్పీ

నేడు (సోమవారం) నిర్వహించాల్సిన గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఆయన అందుబాటులో ఉండని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని ఆయన కోరారు. వచ్చే సోమవారం గ్రీవెన్స్ డే యథావిధిగా జరుగుతుందని తెలిపారు.