News January 13, 2026
సూర్యాపేట: ఎన్నికల సామగ్రి సరఫరాకు టెండర్ల ఆహ్వానం

సూర్యాపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో జరగనున్న రెండో సాధారణ ఎన్నికల కోసం సామగ్రి సరఫరా చేసేందుకు సీల్డ్ టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు అదనపు కలెక్టర్ కె.సీతారామరావు తెలిపారు. ఆసక్తిగల సంస్థలు ఈనెల 17న ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో హాజరుకావాలని కోరారు. పూర్తి వివరాలకు 9885627131 నంబరును సంప్రదించాలని సూచించారు.
Similar News
News February 7, 2026
KMR: మద్యం, మాంసం, మనీ ఎంత ప్రభావం చూపేనో?

ఎన్నికలంటే గుర్తొచ్చేది మద్యం, మాంసం, మనీయే. సరిగ్గా మున్సిపల్ ఎన్నికల్లో సైతం కామారెడ్డి జిల్లాలో ఇదే తీరు కనిపొస్తోంది. ఇప్పటికే పలువురు అభ్యర్థులు పొద్దున టిఫిన్లు అందిస్తే, సాయంత్రానికి స్వీట్లు పంచారు. ఎలక్షన్ ప్రచారం ముగింపు దశకు చేరడంతో వచ్చే ఆదివారం మద్యం, మాంసంతో అభ్యర్థులు వార్డు ప్రజలకు దగ్గర కానున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రభావాలు ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి.
News February 7, 2026
క్రేజీ టైటిల్‌తో తరుణ్ భాస్కర్ మూవీ

ఈ నగరానికి ఏమైంది(ENE) సినిమాతో దర్శకుడు తరుణ్ భాస్కర్‌కు యూత్‌లో ఫుల్ ఫాలోయింగ్ పెరిగింది. తర్వాత ‘కీడా కోలా’ చేసినా అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యారు. దర్శకుడిగా చేస్తూనే నటుడిగానూ ప్రూవ్ చేసుకుంటున్నారు. ‘ENE2’ మూవీ చేస్తున్న తరుణ్ హీరోగా ఓ సినిమాను మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీకి టైటిల్‌ను క్రేజీ డైలాగ్ ‘గాయపడ్డ సింహం’గా ఫిక్స్ చేసినట్లు తెలిపారు. 9న టీజర్ విడుదల కానుందని పేర్కొన్నారు.
News February 7, 2026
బిచ్కుంద: పూరి గుడిసె వాసికి అధికార పార్టీ టికెట్

బిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. పూరి గుడిసెలో నివసించే దళిత మహిళ హన్మవ్వకు కాంగ్రెస్ బీఫాం దక్కంది. హన్మవ్వ భర్త గంగారం 40 ఏళ్ల పాటు పార్టీలో కార్యకర్తగా సేవలందించారు. ఆయన ఇటీవల మృతి చెందారు. అతని సేవలను గుర్తించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గంగారం భార్యకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించారు.


