News December 26, 2025

సూర్యాపేట: ఎస్పీ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలు

image

సూర్యాపేట ఎస్పీ కె.నరసింహ పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలు సృష్టించి మోసాలకు తెరలేపారు. ‘కె.నరసింహ IPS’ పేరుతో అకౌంట్లు తెరిచి, తక్కువ ధరకే ఫర్నిచర్ ఇప్పిస్తామంటూ కొందరికి సందేశాలు పంపారు. ఈ విషయం గమనించిన ఎస్పీ ప్రజలను అప్రమత్తం చేశారు. తన పేరుతో వచ్చే అనుమానాస్పద మెసేజ్‌లకు ఎవరూ స్పందించవద్దన్నారు. డబ్బులు పంపి మోసపోవద్దని సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

Similar News

News December 30, 2025

చరిత్ర చెబుతోంది.. వెండి ధరలు తగ్గుతాయ్: విశ్లేషకులు

image

ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన వెండి ధరలు భారీగా పడిపోతాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. గతంలోనూ వెండి ధరలు పెరిగిన ప్రతిసారీ 40-90% పతనమయ్యాయని గుర్తుచేస్తున్నారు. ఔన్స్‌ వెండి ధర 1980లో $50 నుంచి $5కి (90%), 2011లో $48 -$12కి (75%), 2020లో $30 -$18కి (40%) పడిపోయాయంటున్నారు. పారిశ్రామిక డిమాండ్, చైనా ఎగుమతి ఆంక్షలతో ధరలు పెరుగుతున్నా క్రమంగా తగ్గే ఛాన్స్ ఉందని ఇన్వెస్టర్లను అలర్ట్ చేస్తున్నారు.

News December 30, 2025

గర్ల్ ఫ్రెండ్‌తో ప్రియాంకా గాంధీ కుమారుడి ఎంగేజ్‌మెంట్!

image

కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ, రాబర్ట్ వాద్రాల కుమారుడు రైహాన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇవాళ లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ అవివా బేగ్‌తో ఎంగేజ్‌మెంట్ అయిందని నేషనల్ మీడియా పేర్కొంది. వారిద్దరూ ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారని, పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించినట్లు తెలిపింది. రైహాన్ 2000 సంవత్సరంలో జన్మించారు. అవివా కుటుంబం ఢిల్లీలో ఉంటున్నట్లు సమాచారం.

News December 30, 2025

టాప్-2లో నెల్లూరు జిల్లా

image

పునర్విభజన తర్వాత నెల్లూరు జిల్లా జనాభా తగ్గింది. గతంలో 4 డివిజన్లు, 38 మండలాలు, 24, 69,707 మంది జనాభాతో జిల్లా ఉండేది. తాజా మార్పులతో మండలాల సంఖ్య 36కు తగ్గింది. జనాభా సైతం 22,99, 699కి పడిపోయింది. అయినప్పటికీ జనాభా, మండలాల పరంగా నెల్లూరు జిల్లా రాష్ట్రంలో 2వ స్థానంలో ఉంది. జనాభా పరంగా తిరుపతి, మండలాల పరంగా కడప(41) టాప్‌లో ఉన్నాయి.