News December 17, 2025

సూర్యాపేట: @ ఒంటిగంట వరకు పోలింగ్ శాతం ఎంతంటే?

image

సూర్యాపేట జిల్లాలో నిర్వహించిన 3వ విడత ఎన్నిక పోలింగ్ శాతాన్ని అధికారులు వెల్లడించారు.
చింతలపాలెం – 82.59%
గరిడేపల్లి – 87.72%
హుజూర్‌నగర్ – 83.18%
మట్టంపల్లి – 88.97%
మేళ్లచెరువు – 85.08%
నేరేడుచర్ల – 86.14%
పాలకవీడు – 87.60%
జిల్లా వ్యాప్తంగా 86.19% నమోదైందన్నారు.

Similar News

News December 22, 2025

YS జగన్‌ ఫ్లెక్సీకి రక్తాభిషేకం

image

అనంతపురం జిల్లాలో మాజీ సీఎం YS జగన్ బర్త్ డే సంబరాలు చర్చనీయాంశంగా మారాయి. విడపనకల్లులో వైసీపీ నేతలు వేట కొడవళ్లతో పొట్టేళ్లను నరికి రక్తంతో జగన్ ఫ్లెక్సీలకు అభిషేకం చేశారు. కనగానపల్లి మండలం భానుకోటలో సైతనం ఇదే తరహా సంబరాలు చేసుకున్నారు. ఫ్యాక్షన్‌ గ్రామమైన భానుకోటలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 2029లో రప్పా రప్పా అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పొట్టేళ్లను బలితీయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.

News December 22, 2025

ఆసుపత్రి వార్డుల్లో ఆహారం తినడంపై నిషేధం

image

TG: ఎలుకలు, కీటకాల సమస్య నివారణకు ఆసుపత్రి వార్డుల్లో రోగుల సహాయకులు భోజనం చేయడంపై వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా నిషేధం విధించింది. క్యాంటీన్లలోనే ఆహారం తినేందుకు అనుమతి ఇచ్చింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అమలు చేసేందుకు ప్రజలు సహకరించాలని కోరింది. వార్డులో ఆహారం తిని పారవేయడంతో ఎలుకల బెడద పెరుగుతోందని ప్రభుత్వం భావిస్తోంది. ఆసుపత్రులను పరిశుభ్రంగా ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

News December 22, 2025

RR: నేడు సర్పంచ్ సాబ్, మేడమ్ వస్తున్నారు!

image

సర్పంచ్‌లు, వార్డు సభ్యులు నేడు వారి వారి గ్రామపంచాయతీల్లో ప్రమాణం చేయనున్నారు. రంగారెడ్డి జిల్లాలో 3 విడతల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 526 GPలకు 525 గ్రామాల్లో కొత్త పాలకవర్గాలను ఎన్నుకున్నారు. నేడు వారితో పంచాయతీ సెక్రటరీలు ప్రమాణం చేయిస్తారు. కాగా జిల్లాలో మాడ్గుల మండలంలోని నర్సంపల్లి GPకి ఎన్నిక జరగలేదు. ప్రమాణ స్వీకారంపై జిల్లాలోని MPDOలు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు.