News March 30, 2025

సూర్యాపేట: కేంద్రమంత్రి బండి సంజయ్‌పై మంత్రి సీతక్క ఫైర్

image

రాష్ట్రానికి కాంగ్రెస్ కరప్షన్ వైరస్ సోకిందని, రాష్ట్రంలో సన్నబియ్యం కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో హుజూర్ నగర్‌కు వెళ్తుండగా మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన 12సంవత్సరాల్లో సన్నబియ్యం ఇవ్వాలని ఆలోచన ఎందుకు రాలేదో చెప్పాలన్నారు.

Similar News

News September 17, 2025

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 350 పోస్టులు

image

పుణేలోని బ్యాంక్ ఆఫ్ <>మహారాష్ట్ర<<>> 350 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈనెల 30వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, బీటెక్, బీఈ, MSc, MCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.1180కాగా, SC, ST, దివ్యాంగులు రూ.118 చెల్లించాలి. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

News September 17, 2025

చిత్తూరు: ఐటీఐలో అడ్మిషన్ల ప్రారంభం

image

చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు నాలుగో విడత దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ రవీంద్రారెడ్డి తెలిపారు. నేటి నుంచి ఈనెల 27వ తేదీ వరకు www.iti.ap.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులకు ఈనెల 29న, ప్రైవేట్ విద్యార్థులకు 30వ తేదీన కౌన్సెలింగ్ ఉంటుందని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు దగ్గరలోని ఐటీఐని సంప్రదించాలని సూచించారు.

News September 17, 2025

సాయుధ రైతాంగ పోరాటంలో తొలి మరణం ఇతనిదే..!

image

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి మరణం దొడ్డి కొమురయ్యదే అని చెప్పాలి. 1946 జూలై 4న దేశ్ ముఖ్ ఆకృత్యాలకు వ్యతిరేకంగా కడవెండి గ్రామానికి చెందిన దొడ్డి కొమురయ్య ఎదురొడ్డి నిలబడ్డాడు. శాంతియుతంగా ఆంధ్ర మహాసభల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తుండగా రజాకార్లు, పోలీసులు ఒక్కసారిగా ఆంధ్ర మహాసభ కార్యకర్తలపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో దొడ్డి కొమురయ్య వీర మరణం పొందాడు. అప్పటి నుంచి పోరాటం ఉద్ధృతం దాల్చింది.