News March 4, 2025
సూర్యాపేట: కోదండరామ్ మద్దతిచ్చిన వ్యక్తికి 24 ఓట్లు

వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కోదండరాం మద్దతు ఇచ్చిన పన్నాల గోపాల్ రెడ్డికి 24 ఓట్లు రావడంతో కోదండరామ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఉద్యమ నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ ప్రచారం చేస్తే 24 ఓట్లు రావడం ఏంటని మేధావులు ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు.
Similar News
News February 28, 2026
7 మ్యాచుల్లో 4 POTM అవార్డులు

T20WC-2026లో ఆల్‌రౌండర్ విల్ జాక్స్ ఇంగ్లండ్‌కు వరంలా మారారు. అతడు 7 మ్యాచుల్లో 4 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సొంతం చేసుకోవడం విశేషం. 176 స్ట్రైక్ రేట్‌తో 191 రన్స్ చేయడంతో పాటు 7 వికెట్లు పడగొట్టారు. కీలక సమయాల్లో రాణిస్తూ ఒంటిచేత్తో జట్టును గెలిపిస్తున్నారు. నిన్న NZపై సైతం చివరి ఓవర్లలో సిక్సర్లు, బౌండరీలతో మ్యాచును మలుపుతిప్పారు.
News February 28, 2026
WGL: విద్యార్థులే రథసారథులు..!

మ్యూజిక్, డ్యాన్స్, డ్రమాటిక్‌తో పాటు ఫొటోగ్రఫీ తదితర క్లబ్బులు కళాత్మక నైపుణ్యాలకు వేదికగా నిలుస్తూ ‘స్ప్రింగ్ స్ప్రీ’ లాంటి ఉత్సవాలు నిర్వహిస్తున్నాయి. ఇన్నోవేషన్ గ్యారేజ్, రోబోటిక్స్, కోడింగ్ క్లబ్బులు విద్యార్థుల్లో కొత్త ఆవిష్కరణలు పెంపొందిస్తున్నాయి. యూత్ రెడ్ క్రాస్, నేచర్ క్లబ్ లాంటివి రక్తదాన శిబిరాలు, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి.
#NITW SPRING SPREE
News February 28, 2026
252 ఆధార్ సూపర్‌వైజర్/ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

CSC ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ 252 ఆధార్ సూపర్ వైజర్/ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల్లో TGలో 10, APలో 7 పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్+ITI, ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణులైన వారు మార్చి 10 వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cscspv.in


