News February 4, 2025
సూర్యాపేట: చికెన్ ముక్క కోసం పంచాయితీ
చికెన్ ముక్క రెండు గ్రామాల మధ్య వివాదానికి తెరలేపింది. స్థానికుల వివరాలు.. మేళ్లచెరువులోని ఓ చికెన్ దుకాణంలో మరో గ్రామానికి చెందిన వ్యక్తి చికెన్ కొనుగోలు చేశాడు. చికెన్ ముక్క కోరిన విధంగా ఇవ్వలేదని ప్రశ్నించగా షాపు నిర్వాహకుడు దాడి చేశాడు. షాపు నిర్వాహకుడిపై బాధితుడి తరఫు బంధువులు దాడి చేశారు. దీంతో 2 గ్రామాల మధ్య పంచాయితీ మొదలై పెద్ద మనుషుల జోక్యంతో చికెన్ షాప్ యజమానికి జరిమానా విధించారు.
Similar News
News February 4, 2025
NLG: తొలిరోజు ఒక్క నామినేషన్ దాఖలు
వరంగల్ – ఖమ్మం- నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి రోజు ప్రజావాణి పార్టీ అభ్యర్థి లింగిడి వెంకటేశ్వర్లు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 10 వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందని, ఈనెల 8, 9 తేదీలలో ప్రభుత్వ సెలవు దినాలలో ఎలాంటి నామినేషన్లు స్వీకరించడం జరగదని తెలిపారు.
News February 4, 2025
జగిత్యాల: 3 నెలల క్రితమే పెళ్లైంది.. ఇంతలోనే విషాదం
వెల్గటూర్ PS పరిధిలోని అంబారీపేట గ్రామానికి చెందిన అల్లే సాగర్(28) అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ ఉమాసాగర్ తెలిపారు. 3 నెలల క్రితమే మృతుడికి వివాహం జరిగిందని, అతడి తండ్రి అల్లె చంద్రయ్య నెలరోజుల క్రితమే ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లారని గ్రామస్థులు తెలిపారు. పెళ్లికి, గల్ఫ్ వెళ్లటానికి రూ.6లక్షలు అప్పులు చేశాడని.. వీటిని తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు.
News February 4, 2025
ఐటీ విచారణకు దిల్ రాజు
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఐటీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇటీవల ఆయన కార్యాలయంతో పాటు నివాసాల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో వ్యాపారాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు.