News August 15, 2025

సూర్యాపేట: జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి ఉత్తమ్

image

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్ర్య పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Similar News

News August 15, 2025

‘రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధిలో దూసుకెళ్తుంది’

image

భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ సందీప్ కుమార్ ఘా జాతీయ జెండాను ఎగురవేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకెళుతుందన్నారు. జిల్లా ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

News August 15, 2025

ప్రకాశం జిల్లాలో బాలిక కిడ్నాప్

image

చీమకుర్తిలోని ఓ ప్రైవేటు స్కూల్ నుంచి బాలికను శుక్రవారం కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. బాలిక తండ్రి తన నుంచి రూ.5 లక్షల అప్పు తీసుకుని ఇవ్వలేదని ఈశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి ఆమెను కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత కుమార్తెతో తండ్రికి ఫోన్ చేయించాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈశ్వర్ రెడ్డి బాలికను తిరుపతి వైపు తీసుకెళ్తుండటంతో పోలీసులు అతడిని వెంబడిస్తున్నారు.

News August 15, 2025

తెలంగాణ డీజీపీ జితేందర్ తల్లి కన్నుమూత

image

తెలంగాణ డీజీపీ జితేందర్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి కృష్ణ గోయల్ (85) కన్నుమూశారు. అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రేపు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఆమె మృతి పట్ల రాజకీయ నేతలు, పోలీస్ అధికారులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.