News March 16, 2025

సూర్యాపేట: జిల్లాలో చికెన్ ధరలు ఇలా

image

సూర్యాపేట జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్(విత్‌ స్కిన్) కేజీ రూ.170-180 ఉండగా..స్కిన్‌లెస్ కేజీ రూ.200 ధర పలుకుతోంది. అలాగే లైవ్ కోడి రూ.110-120 మధ్య ఉంది. కాగా, బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో గత నెల క్రితం భారీగా అమ్మకాలు పడిపోగా, ప్రస్తుతం అమ్మకాలు పెరగాయని, ధర సైతం పెరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు. 

Similar News

News March 16, 2025

సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన వరంగల్ సీపీ

image

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌ మండలం శివునిపల్లి శివారు ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనేందుకు హెలికాప్టర్‌లో సభాస్థలికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డిని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పాగుచ్ఛాన్ని సీఎంకు సీపీ అందజేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ ముఖ్యమంత్రితో సభాస్థలికి చేరుకున్నారు.

News March 16, 2025

విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చేప్పిన పల్నాడు కలెక్టర్

image

జిల్లాలోని పదవ తరగతి విద్యార్థులందరూ ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు కోరారు. జిల్లాలో 463 పాఠశాల నుంచి మొత్తం 26,497 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. జిల్లాలో 128 పరీక్ష కేంద్రాలలో బాలురు 13,415 మంది బాలికలు 1,382 మంది ఉన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలన్నారు. జిల్లాలోని విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.

News March 16, 2025

రేపు ఓయూ బంద్‌కు ఏబీవీపీ పిలుపు

image

ఉస్మానియా యూనివర్సిటీలో ప్రదర్శనలు, నిరసనలపై నిషేధం విధిస్తూ ఓయూ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా సోమవారం ఓయూ బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. యూనివర్సిటీల్లో నియంతృత్వ పోకడలు సరికాదని పేర్కొంది. ఓయూలో ఉద్యోగ భర్తీ, నిధుల కొరత, విద్య నాణ్యత, ఆహార నాణ్యత తదితరాంశాలపై దృష్టి సారించాలని అధికారులకు విజ్ఞప్తి చేసింది.

error: Content is protected !!