News December 19, 2025

సూర్యాపేట జిల్లాలో దరఖాస్తులకు ఆహ్వానం

image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అల్పసంఖ్యాక వర్గాల విద్యార్థులకు సీఎం ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం కింద విదేశీ ఉన్నత విద్యకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పీజీ, డాక్టర్ల చదువుల కోసం అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూర్యాపేట జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి ఎల్.శ్రీనివాస్ తెలిపారు. ఎంపికైన వారికి రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. 2026 జనవరి 19 దరఖాస్తుల గడువు చివరి తేదీ.

Similar News

News December 19, 2025

‘గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా సుందరీకరణ పనులు’

image

మేడారంలో పర్యటన సందర్భంగా మంత్రి సీతక్క సాండ్ స్టోన్ బొమ్మల లిపి చిత్రాలను, రాతి స్తంభాలను, ఐటిడిఏ ఆఫీసు నుంచి జంపన్నవాగు రహదారి పనులను పరిశీలించి.. తగినంత వాటర్ క్యూరింగ్ చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు. చిలకలగుట్ట జంక్షన్లో ఏర్పాటు చేస్తున్న సుందరీకరణ పనులను పరిశీలించి పర్యటకులను ఆకర్షించే విధంగా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా సుందరీకరించాలని ఆదేశించారు.

News December 19, 2025

VJA: సీపీ కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

image

ఎన్టీఆర్ జిల్లా సీపీ కార్యాలయంలో పోలీస్ పరిపాలనా విభాగం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీపీ రాజశేఖర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీస్ అధికారులు, సిబ్బందికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పండుగల ఆదర్శాలు అందరూ పాటించాలని సూచించారు. అనంతరం సెమీ క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ సరిత, ఈస్ట్ డీసీపీ కృష్ణకాంత్ పటేల్ పాల్గొన్నారు.

News December 19, 2025

వరంగల్‌లో జిల్లాస్థాయి స్పోర్ట్స్ మీట్ ప్రారంభం

image

వరంగల్ టీజీఎంఆర్‌ఎస్&జూనియర్ కాలేజ్‌లో జిల్లా పరిధి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌ను మంత్రి కొండా సురేఖ క్రీడా పోటీలను శుక్రవారం ప్రారంభించారు. విద్యార్థుల శారీరక, మానసిక అభివృద్ధికి క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి అన్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీవో సుమ పాల్గొన్నారు.