News November 23, 2025
సూర్యాపేట జిల్లాలో మెడికల్ దందా

జిల్లాలో మెడికల్ షాపుల్లో దందా ఇష్టరాజ్యమైంది. పేదల అవసరాలను ఆసరాగా చేసుకుని వారే డాక్టర్లా సలహాలు ఇచ్చి అడ్డగోలుగా మందులు అమ్ముతున్నారు. జిల్లాలో సుమారు 700 మెడికల్ షాప్‌లు రిజిస్టర్ కాగా.. అనధికారికంగా మరో వందకు పైగా షాపులు ఉన్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. వైద్యుడి చీటి లేకుండానే మందులు విక్రయిస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.
Similar News
News November 24, 2025
అన్నమయ్య: పక్కా ఇల్లు.. 6రోజులే గడువు

గ్రామీణ ప్రాంతాల్లోని పేదల సొంతింటి నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూత ఇస్తున్నాయి. స్థలం ఉన్నవాళ్లకు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేస్తారు. స్థలం లేనివాళ్లకు 3సెంట్లు కేటాయించి ఇల్లు మంజూరు చేస్తారు. ఈనెల 30వ తేదీ వరకు గడువు ఉంది. ఇప్పటి వరకు అన్నమయ్య జిల్లాలో 18వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. మిగిలిన వాళ్లు సైతం సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే ఇల్లు మంజూరు చేస్తారు.
News November 24, 2025
భీమవరం: 3,000 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల వేదికగా ఈ నెల 29న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. ఈ డ్రైవ్‌లో 28కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని, సుమారు 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని అర్హులైన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News November 24, 2025
తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 710 తగ్గి రూ.1,25,130కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ. 650 పతనమై రూ.1,14,700 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.1,000 తగ్గి రూ.1,71,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


