News March 20, 2025
సూర్యాపేట జిల్లాలో యువతిపై అత్యాచారం

HNRలో యువతిపై అత్యాచారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. SI ముత్తయ్య తెలిపిన వివరాలిలా.. పట్టణానికి చెందిన స్వామిరోజాకు ఓ యువతితో పరిచయముంది. రోజా ద్వారా ఆమె ప్రియుడు ప్రమోద్‌కుమార్ యువతికి పరిచయమయ్యాడు. ఈనెల 7న ఆ యువతిని ప్రమోద్ కుమార్ ఓ లాడ్జికి తీసుకెళ్లి మద్యం తాపి అత్యాచారం చేసి ఫోటోలు తీశారు. తిరిగి మంగళవారం ఆ యువతిని లోబర్చుకునేందుకు ప్రయత్నించగా తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Similar News
News January 27, 2026
మున్సిపల్ పోరుకు సిద్ధం కావాలి: కలెక్టర్

నల్లగొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్ఈసీ రాణి కుమిదిని, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం కలెక్టర్ ఆర్డీవోలు, కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు.
News January 27, 2026
NLG: మోగిన ఎన్నికల నగారా… రేపటి నుంచే నామినేషన్ల స్వీకరణ

మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో నల్గొండ కార్పొరేషన్లో ఎన్నికల సందడి మెుదలైంది. రేపటి నుంచి ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నల్గొండ కార్పొరేషన్లో మొత్తం 48 డివిజన్లలో 1,42,437 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 73,507 మంది మహిళలు, 68,874 మంది పురుషులు, 56 మంది ఇతరులు ఉన్నారు. మేయర్ స్థానం జనరల్ మహిళకు కేటాయించారు.
News January 26, 2026
మదర్ డెయిరీలో ముదిరిన సంక్షోభం

నల్గొండ జిల్లాలోని మదర్ డెయిరీలో పాలకవర్గ వివాదాలు, ఆర్థిక ఇబ్బందులు పరాకాష్టకు చేరుకున్నాయి. 15 రోజుల్లోనే ఇద్దరు ఛైర్మన్లు రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. తాజా పరిణామాలతో మందడి ప్రభాకర్ రెడ్డి తన ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. డెయిరీకి ఉన్న ₹28 కోట్ల అప్పు విషయంలో బ్యాంకులు సీరియస్ అయ్యాయి. ఫిబ్రవరి 1 లోగా ₹10 కోట్లు చెల్లించకుంటే డెయిరీని సీజ్ చేస్తామని హెచ్చరించాయి.


