News January 8, 2026

‘సూర్యాపేట జిల్లాలో 10 వేల టన్నుల యూరియా నిల్వలు’

image

జిల్లాలో రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ప్రస్తుతం 10 వేల టన్నుల యూరియా నిల్వలు ఉన్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి తెలిపారు. గురువారం కోదాడ మండలంలోని పలు ఎరువుల దుకాణాలను ఆయన తనిఖీ చేసి, మాట్లాడారు. సొసైటీలు, ప్రైవేట్ డీలర్ల ద్వారా ఎరువుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని, ముందస్తుగానే అవసరమైన మేర యూరియా సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News February 6, 2026

స్మృతి.. వాట్ ఏ ఛాంపియన్

image

కొన్ని రోజుల క్రితమే ప్రియుడితో అనూహ్య పరిస్థితుల్లో పెళ్లి రద్దయ్యి గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారు క్రికెటర్ స్మృతి మంధాన. దీనిపై పలు రకాలుగా ప్రచారం జరిగినా ఆమె పట్టించుకోలేదు. తిరిగి కొన్ని రోజులకే బ్యాట్ పట్టారు. శ్రీలంకతో సిరీస్‌‌లో ఫర్వాలేదనిపించినా WPLలో ఆర్సీబీ సారథిగా సత్తా చాటారు. సీజన్‌లో అత్యధిక పరుగులు చేయడమే కాకుండా ఫైనల్లో POTMగా నిలిచి అసలైన ఛాంపియన్ అనిపించుకున్నారు.

News February 6, 2026

దుబ్బాకకు బద్ద శత్రువు హరీశ్ రావే: ఎంపీ

image

దుబ్బాక అభివృద్ధికి ఒక్క రూపాయి రాకుండా అడ్డుపడింది హరీశ్ రావేనని ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే 27 నెలల్లో 27 సార్లు నియోజకవర్గానికి రాలేదని విమర్శించారు. దుబ్బాక మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి, పట్టణ అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు చారిత్రక అవసరమని పేర్కొన్నారు.

News February 6, 2026

HYD: భవనంపై నుంచి దూకి వివాహిత సూసైడ్

image

కూకట్‌పల్లిలోని సీబీసీఐడీ కాలనీలో అనిత(23) వివాహిత ఆఫీస్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అనితకు 2021లో బాచుపల్లి శ్రీనివాస్‌తో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.