News December 17, 2025
సూర్యాపేట జిల్లాలో 9 గంటల వరకు నమోదైన పోలింగ్

సూర్యాపేట జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉదయం 7 గంటల నుంచి 9 వరకు నమోదైన పోలింగ్ వివరాలను అధికారులు వెల్లడించారు.
చింతలపాలెం – 26.84%
గరిడేపల్లి – 25.18%
హుజూర్‌నగర్ – 20.66%
మట్టంపల్లి – 27.74%
మేళ్లచెర్వు – 23.48%
నేరేడుచర్ల – 21.02%
పాలకవీడు – 26.70% నమోదైనట్లు తెలిపారు.
Similar News
News December 20, 2025
చౌడేపల్లి: ‘సచివాలయ సిబ్బందికి జీతాలు నిలుపుదల’

చౌడేపల్లె మండలం చారాల సచివాలయంలోని పలువురి సిబ్బందికి మూడు నెలల జీతాలను నిలుపుదల చేస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఓం ప్రసాద్, కృష్ణమూర్తి, హిమబిందు, సోమశేఖర్, మహమ్మద్ ఆరీఫ్ లకు జీతాలు నిలుపుదల చేయాలని అధికారులు ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంతోనే వారికి జీతాలు నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
News December 20, 2025
మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో గుంటూరు పోలీసుల పతక వర్షం

నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన 44వ ఏపీ రాష్ట్ర మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2025లో గుంటూరు జిల్లా పోలీస్ సిబ్బంది సత్తా చాటారు. ముగ్గురు ఏఎస్ఐలు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డు కలిపి ఆరుగురు పాల్గొని మొత్తం 18 పతకాలు (14 స్వర్ణాలు, 3 రజతాలు, 1 కాంస్యం) సాధించారు. వివిధ వయో విభాగాల్లో ట్రాక్, ఫీల్డ్ ఈవెంట్లలో మెరిసిన విజేతలను ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు.
News December 20, 2025
BHPL: పీఏసీఎస్‌లకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం

జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ శాఖ సహకార పరపతి సంఘాలకు రద్దయిన పాలకవర్గాల స్థానంలో స్పెషల్ ఆఫీసర్లను కమీషనర్ నియమించినట్లు జిల్లా సహకార శాఖ అధికారి వాల్యానాయక్ తెలిపారు. గారేపల్లి, మహాదేవపూర్, మహాముత్తారం, చిట్యాల సొసైటీలకు అసిస్టెంట్ రిజిస్టర్ రాజు, రేగొండ, మొగుల్లపెళ్లి- డిప్యూటీ రిజిస్టర్ శైలజ, తాడిచెర్ల జంగేడు- సీనియర్ ఇన్స్పెక్టర్ రిలీఫ్, ఘనపూర్, చెల్పూర్- ఎల్లయ్యలను నియమించారు.


