News December 26, 2025

సూర్యాపేట: జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్‌‌కు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: డీఈఓ

image

2025-26 రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శణి (RSBVP)-ఇన్‌స్పైర్ మానక్ (DLEPC) జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్‌‌కు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని డీఈఓ అశోక్ తెలిపారు. ఈ నెల 30, 31 తేదీల్లో హుజూర్‌నగర్‌లో నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల నుంచి పాల్గొనే విద్యార్థులు, గైడ్ ఉపాధ్యాయులు రిజిస్ట్రేషన్ ఫామ్‌ను నింపి రెండు జతలు, ఒక రైట్ అప్‌తో పాటు కౌంటర్‌లో అందజేయాలన్నారు.

Similar News

News December 29, 2025

కర్నూలు: తిరుమల వెళ్లి వస్తుండగా విషాదం

image

ఒంటిమిట్ట మండలంలోని మట్టంపల్లి-నందలూరు మధ్య ఆదివారం సాయంత్రం పూణే ఎక్స్‌ప్రెస్ రైలుకింద పడి శ్రీనివాసులు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు కడప రైల్వే SI సునీల్ తెలిపారు. మృతుడు కర్నూలు జిల్లా అప్సరి మండలం శంకరంబాడి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో రైలు నుంచి పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు.

News December 29, 2025

అసెంబ్లీలో ‘వరంగల్’ గళం వినిపించేనా?

image

నేటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలపై ఉమ్మడి జిల్లా వాసుల్లో ఉత్కంఠ నెలకొంది. జిల్లాలోని 12 మంది ఎమ్మెల్యేల్లో 11 మంది అధికార పక్షంలోనే ఉన్నప్పటికీ, నియోజకవర్గ సమస్యలపై వారు ‘అధ్యక్షా’ అంటూ నోరు విప్పుతారా? అని ప్రజానీకం ఎదురుచూస్తోంది. గ్రేటర్ వరంగల్ డివిజన్ల పెంపు, కాజీపేట బ్రిడ్జి, ఎయిర్ పోర్ట్, 24 అంతస్తుల ఆసుపత్రి నిధులపై ప్రజాప్రతినిధులు గళమెత్తాలని ప్రజలు కోరుతున్నారు.

News December 29, 2025

ప.గో: ఓ వైపు బరులు.. మరోవైపు వినతులు

image

గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. పండుగ నేపథ్యంలో పలుచోట్ల కోడి పందేల నిర్వహణకు బరులను సిద్ధం చేస్తున్నారు. అధికారిక అనుమతులు రాకముందే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే వీరవాసరం, ఆకివీడు, భీమవరం మండలాల్లో పందేలను నివారించాలంటూ స్థానికులు అధికారులకు వినతిపత్రాలు అందజేస్తుండటం గమనార్హం. ఓవైపు పందేలకు సన్నాహాలు, మరోవైపు ప్రజల అభ్యంతరాలు కొనసాగుతున్నాయి.