News March 17, 2025
సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నేడు ప్రజావాణి

సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కే.నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా బాధితులు తమ సమస్యలను ప్రజావాణిలో ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Similar News
News January 27, 2026
APPLY NOW: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో పోస్టులు

కాన్పూర్‌లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL)లో అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి జనవరి 30 ఆఖరు తేదీ. ఇంటర్(ఒకేషనల్), టెన్త్, ఐటీఐ అర్హతగల వారు ముందుగా NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వయసు 18 నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://hal-india.co.in
News January 27, 2026
నవ గ్రహాలు – ఇష్టమైన ధాన్యం

ఆదిత్యుడు – గోధుమలు
చంద్రుడు – బియ్యం/వడ్లు
అంగారకుడు – కందిపప్పు
బుధుడు – పచ్చ పెసర పప్పు
గురు – వేరుసెనగ పప్పు
శుక్రుడు – చిక్కుడు గింజలు
శని – నల్ల నువ్వులు
రాహువు – మినుములు
కేతువు – ఉలవలు
News January 27, 2026
థైరాయిడ్‌తో గుండెకు ముప్పు

శరీరానికి అవసరమైన థైరాయిడ్ హార్మోన్‌ను థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేస్తుంది. ఇది తక్కువైనా, ఎక్కువైనా కూడా ప్రమాదమే అంటున్నారు నిపుణులు. హార్వర్డ్ యూనివర్శిటీ కథనం ప్రకారం థైరాయిడ్‌తో గుండె సమస్యల ముప్పు పెరుగుతుంది. హైపోథైరాయిడిజమ్ వల్ల గుండె కొట్టుకునే వేగం, రక్తనాళాలు సాగే లక్షణం తగ్గుతుంది. హైపర్ థైరాయిడిజం ఉంటే గుండె వేగంగా కొట్టుకుంటుంది. దీంతో గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ అవుతుంది.


